పాకిస్తాన్ కి షాక్.. స్వతంత్రం ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్

BLA పాకిస్తాన్ లోని బలూచీస్తాన్‌ రాజధాని అయిన క్వెట్టా ను తమ అధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులు ఎత్తేసిందని సమాచారం. ఈ ప్రాంతంలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ నుండి స్వాతంత్రం పొందామని బలూచ్‌ ల ప్రకటన ఆసక్తి కరంగా మారింది.

ఒకవైపు పాకిస్థాన్ ను భారత్ బాదుుంటే.. మరోవైపు బలూచ్ వాళ్లు ఇంకోవైపు బాది వదిలిపెడుతున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ బయటకు వెళ్తే, ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారెంటీ లేకుండా చేస్తోంది. గతంలో బలూచ్ ఆర్మీ పాక్ రైలును హైజాక్ చేసిన పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ వాళ్లను మిలటరీ అధికారులను పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేసింది. నిన్న పాక్ ఆర్మీ వాహనం పై రిమోట్ కంట్రోల్ తో…IED బాంబు ను పేల్చింది. ఈ దాడిలో ఏకంగా 14 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ముచ్ కుంద్ ప్రాంతంలో…ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే బలూచ్ లోని చాలా ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వ నియంత్రణ లేదు. అక్కడ పాక్ ఆర్మీ అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితులు నెలకున్నాయి. మంత్రులు, ఉన్నతాధికారులు సెక్యూరిటీ ఎస్కార్ట్ లేకుండా బలూచిస్తాన్ ప్రావిన్సులో తిరగలంటేనే భయపడే పరిస్థితులు నెలకున్నాయి.
మరోవైపు పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలు ఉన్న తొమ్మిది స్థావరాలపై భారత్‌ అటాక్‌ చేసింది. ఈ దెబ్బకు వందకు పైగా ఉగ్రవాదులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన మారణకాండకు ప్రతీకార చర్యగా…ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది భారత్‌ ఆర్మీ. ఇక తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్య్రం ప్రకటించుకోవడం విశేషం.