పిడుగులా దాడి.. పాక్ వైమానిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు, అమెరికా జోక్యంతో సయోధ్య⁉️

⭕పిడుగులాంటి దెబ్బ

పాక్ వైమానిక స్థావరాలపై భారత్ మెరుపు దాడులు, అమెరికా జోక్యంతో సయోధ్య⁉️

మే 10న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందన్న ప్రకటన వెలువడిన మరుక్షణమే పాకిస్తాన్ తన అసలు స్వరూపం చూపింది. జమ్మూ కాశ్మీర్, గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతాలతో పాటు మరి కొన్ని చోట్ల డ్రోన్లు, క్షిపణులతో దుస్సాహసానికి ఒడి గట్టింది. అయితే, అప్రమత్తమైన భారత సైన్యం వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. రజౌరిలో స్వల్ప నష్టం వాటిల్లినా, భారత జవాన్ల ధీటైన ప్రతి స్పందనతో అర్ధరాత్రికి కాల్పులు సద్దు మణిగాయి.

ఈ అనూహ్య పరిణామాల మధ్య, పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తు ఉంది. కాల్పుల విరమణ సమాచారం కింది స్థాయి సైనికులకు చేరక పోవడమే ఇందుకు నిదర్శనం. కానీ, మే 11 నాటికి పరిస్థితి శాంతించింది. మే 12న భారత్, పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం జరగనుండటంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

అయితే, ఈ హఠాత్తు పరిణామాలపై ప్రజల్లో, రక్షణ రంగ నిపుణుల్లో అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. పాకిస్తాన్ అంత త్వరగా ఎలా లొంగిపోయింది? భారత్ ఎటువంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ట్రంప్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు?

పాకిస్తాన్ లొంగిపోవడానికి అసలు కారణం మే 10న కేవలం 90 నిమిషాల్లో భారత వైమానిక దళం చేసిన మెరుపు దాడులే. ఏకంగా 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో భారత్ తన స్వదేశీ అస్త్రమైన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించింది, ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

రహీం యార్ ఖాన్, రావల్పిండిలోని నూర్ ఖాన్, జాంగ్‌లోని రఫీకుల్ బేస్, షోర్కోట్, చక్వాల్‌లోని మురీద్ బేస్‌లతో పాటు, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్కార్దు, జాకోబాబాద్‌లోని మూడు కీలకమైన ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి.

ముఖ్యంగా, లేహ్-లడఖ్ ప్రాంతానికి కీలకమైన స్కార్దు స్థావరం నియంత్రణ రేఖకు కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉండటం పాకిస్తాన్‌కు తీవ్రమైన హెచ్చరికను పంపింది.

ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అమెరికా పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యాధునిక ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉంచిన సర్గోధ వైమానిక స్థావరం కూడా భారత దాడుల ధాటికి నేల కూలింది. అంతే కాదు, సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలలో పాకిస్తాన్ రహస్యంగా నిర్మించిన సొరంగాలలో దాచిన అణ్వాయుధాలపై కూడా భారత్ దృష్టి సారించింది.

మధ్యాహ్నం వరకు కొనసాగిన దాడుల అనంతరం, పాకిస్తాన్ తమ వద్ద ఆయుధాలు నిండుకున్నాయని, కేవలం అణ్వాయుధాలు మాత్రమే మిగిలాయని అమెరికాకు సంకేతాలు పంపింది. కానీ, భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సర్గోధ సమీపంలోని కార్నీ పర్వతాలపై బాంబుల వర్షం కురిపించింది.

ముఖ్యంగా ఆరు సొరంగాల ప్రవేశ ద్వారాల వద్ద జరిగిన పేలుళ్ల వల్ల లోపల ఉన్న అణ్వాయుధాలు వేడికి ధ్వంసమై ఉండవచ్చని నిపుణులు భావిస్తు ఉన్నారు. ఈ దాడుల కారణంగా 4.0 తీవ్రతతో భూ కంపం సంభవించిందని వార్తలు రావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంతకుముందు చెఘాయి హిల్స్ ప్రాంతంలో కూడా ఇదే తీవ్రతతో భూ కంపం రావడం అనుమానాలకు తావిచ్చింది.

భారతదేశం చెఘాయి హిల్స్‌పై దాడి చేయడంతో అమెరికా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. అణ్వాయుధ యుద్ధం తప్పదనే భయం ఒకవైపు, తమ ఆయుధాలు ఇలా పేలిపోతుంటే ప్రపంచవ్యాప్తంగా తమ ఆయుధ మార్కెట్ పడి పోతుందనే ఆందోళన మరోవైపు అమెరికాను కలవరానికి గురిచేసింది.

దీంతో హుటాహుటిన అమెరికా రంగంలోకి దిగి కాల్పులను ఆపడానికి ప్రయత్నించింది. అదే సమయంలో, భారత్ బెలూచిస్తాన్‌లోని బోలారి వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేసింది. ఈ దాడుల్లో భారతీయ యుద్ధ విమానాలు పాల్గొనలేదు, కేవలం అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణులు లక్ష్యాలను ఛేదించాయి.

ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన 52 మంది ఉన్నత స్థాయి సైనిక, వైమానిక దళ అధికారులు మరణించినట్లు పాకిస్తాన్ స్వయంగా అంగీకరించింది. అంతే కాకుండా, పాకిస్తాన్ యొక్క ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేసే అమెరికన్ ఎవాక్స్ విమానాలు కూడా దాడుల్లో దెబ్బ తిన్నాయి.

మొత్తం మీద, అమెరికన్ ఆయుధాల విశ్వసనీయత ప్రశ్నార్థకమైంది. భారతదేశం ఎవరి సహాయం లేకుండా, కేవలం తన స్వంత శక్తితో ఈ దాడులను విజయ వంతంగా నిర్వహించడం ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. దీంతో అమెరికా తన ఆయుధ మార్కెట్‌ను కాపాడుకోవడానికి, అణ్వాయుధ యుద్ధాన్ని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

సర్గోధ, కర్ణీ హిల్స్‌పై భారత్ చేసిన దాడులు అణ్వాయుధ ముప్పును తాము ఏమాత్రం లెక్క చేయమని పాకిస్తాన్‌కు, అమెరికాకు స్పష్టంగా తెలియ జేశాయి.

దీని ఫలితంగానే అమెరికా తొందరగా ఈ చర్చల కోసం భారత్‌పై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చు. అయితే, అమెరికా నేరుగా సంప్రదించకముందే, పాకిస్తాన్ డీజీఎంఓ భారత్‌తో మాట్లాడారు. ఆ తర్వాత భారత్ కూడా చర్చలకు సిద్ధమైంది. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మొత్తం మీద దేశంలో కొంత నిరాశ నెలకొంది. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పిందని చాలా మంది భారతీయులు భావించారు. కానీ, హఠాత్తుగా కాల్పుల విరమణకు అంగీకరించడం, మే 12న జరగ బోయే డీజీఎంఓ స్థాయి చర్చలు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

అమెరికా అధ్యక్షుడు చేస్తున్న బాధ్యతారహితమైన ట్వీట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, దీనికి భారత్, పాకిస్తాన్ రెండూ అంగీకరించాయని ఆయన ప్రకటించడం విడ్డూరంగా ఉంది.

భారత్ 1971 సిమ్లా ఒప్పందం నుండి స్పష్టంగా చెబుతోంది, భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక వ్యవహారాల్లో మూడవ వ్యక్తికి స్థానం లేదని. కాశ్మీర్ సమస్యను ఇరు దేశాలు మాత్రమే కూర్చుని పరిష్కరించుకుంటాయని భారత్ అనేకసార్లు స్పష్టం చేసింది. 1994లో భారత పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ప్రకారం, పాక్ ఆక్రమిత భూభాగాలను తిరిగి తీసుకోవడమే తక్షణ కర్తవ్యం.

1971 నుండి 1994 వరకు భారత్ అనుసరించిన విధానానికి ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ విషయంపై భారత ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే, గత 30-40 సంవత్సరాలుగా, ముఖ్యంగా 2014 నుండి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌ను ఒంటరిగా చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అవుతాయి.

కాశ్మీర్ యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఏకైక శక్తి భారతదేశమేనని స్పష్టం చేస్తూ, మూడవ శక్తి లేదా మధ్యవర్తి ప్రమేయాన్ని తిరస్కరించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమాన, అపోహలకు తావు లేకుండా ప్రభుత్వం వీలైనంత త్వరగా స్పష్టమైన ప్రకటన చేయాలి! ఇదే విషయంపై పలువురు సోషల్ మీడియాలో ప్రధానికి మెసేజ్లు పెడుతున్నారు.