20 నుండి ఖమ్మంలో ఉచిత యోగా తరగతులు..
……………………………………….
ప్రస్తుతం హడావుడి జీవితంలో యోగ అనేది ఒక భాగంగా అలవాటు కావాలి అనేది అందరికీ తెలిసిన విషయమే… యోగా చేయడం వల్ల మన ఆయూని పెంచుకున్నట్లే అని చాలామంది యోగా గురువులు తెలుపుతున్న విషయం.. కాకపోతే ఆ యోగ ఎలా నేర్చుకోవాలి ఏమిటి అనేది ఖచ్చితంగా గురువు ఉండాలి అటువంటి అవకాశాన్ని మన ఖమ్మం నగరానికి చెందిన పీస్ యోగ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఉచిత యోగ తరగతులు నిర్వహిస్తున్నట్లు శ్రద్ధ శ్రీ యోగా చార్యులు, షేక్ బహర్ అలీ గారు తెలిపారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 తేది నుండి 30వ తేదీ వరకు పది రోజులు, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణ శిబిరంలో యోగా, ప్రాణాయామము, ధ్యానము,ఆయుర్వేదము,డైట్, న్యూట్రిషన్, తరగతులు ఉంటాయన్నారు. ఖమ్మం నగరం ఖానాపురం హైవేలి,ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ 17 లో శిక్షణ తరగతులు 30 వరకు నిర్వహించుచున్నారు. కావున ఈ యోగ తరగతులలో చేరడానికి ఆసక్తి గలవారు ముందుగా ఈ నెంబర్ కి ఫోన్ చేసి 7396126557. తమ పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు..