పాకిస్తాన్ లాంటి తీవ్రవాద దేశాలకు రంగు తినేలా చేయాలంటే శత్రుదేశాలను కలుపుకోవాల్సిందే.. మనకు కష్టం వస్తేనే మన వాళ్లేవరు కానివాళ్లెవరో తెలుస్తుందని పెద్దలంటారు. ప్రస్తుతం మన ఇండియాకి కూడా యుద్ధం వేళ శత్రువులేవరు తన మిత్రువులేవరో తెలిసింది.సాయం చేసినా నీచ బుద్ధి చూపించిన తూర్కియే, అజర్ బైజన్ లాంటి దేశాలు ఇపుడు వారి బుద్ధికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇక అమెరికా ఎపుడు ఉండే ద్వంద్వ వైఖరితో నేనింతే కమర్షియల్ అంటూ తన బుద్ధి చూపించింది. ఇక మనకోసం ఉండే మిత్రులు రష్యా, ఇజ్రాయెల్, సౌదీ మనతోనే ఉన్నాయి. ఇక శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్నట్లుగా బలూచిస్థాన్ పరిస్థితి ఉంది. పాకిస్థాన్, ఇండియా యుద్ధం సందర్బంగా ఇదే అదనుగా బలూచిస్తాన్ లిబెరేషన్ ఆర్మీ తమని స్వత్రంత్ర దేశంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తోంది. తమకు మద్దతు ఇవ్వాలంటూ ఆశగా భారత్ వైపు చూస్తోంది.
బలూచిస్తాన్ విషయంలో ఇండియా ఏమాలోచిస్తోంది…
శత్రువులు ఎక్కడో ఉండరు మన మధ్యనే మన పక్కనే ఉంటారు అన్నట్లుగా పాకిస్థాన్ కి పక్కలో బల్లెం లాగ బలూచిస్తాన్ తయారైంది. తాజాగా ఇండియా దాటికి దాడికి జడిసిన పాకిస్థాన్ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న బలూచి లిబెరేషన్ ఆర్మీ బిఎల్ఏ అక్కడ స్వాత్రంత్రం ప్రకటించుకుంది. అంతర్జాతీయంగా తమని స్వత్రంత్ర దేశంగా గుర్తించాలని అభ్యర్థిస్తోంది. ఇండియా మద్దతుతో దేశంగా మారాలని ప్రయత్నిస్తోంది. మన దేశంలో దౌత్య కార్యాలయం ఏర్పాటుకు సహకరించమని అడుగుతోంది. ఇప్పటికే బిఎల్ఏ బలూచిస్థాన్ లోని కీలక పట్టణాలను స్వాదినం చేసుకుని పాక్ ఆర్మీని అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలని అదేశించింది. అంతేకాక డేరా బుగ్తీ ప్రాంతంలో దాదాపు 100 గ్యాస్ బావులను తన అదుపులోకి తెచ్చుకున్న బిఎల్ఏ వాటిని అడ్డుపెట్టుకుని పాక్ ఆర్మీని బెదిరిస్తోంది. అలాగే ఐక్య రాజ్య సమితిని తమని స్వత్రంత్ర దేశంగా పరిగణించి పాక్ ఆర్మీని తమ దేశం నుండి వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటోంది. అయితే ఇదంతా అంత సులభమైన విషయం కాదు. బలూచి లిబెరేషన్ ఆర్మీ ఒక అతివాద గ్రూప్ అది దేశంగా ఒక ప్రాంతాన్ని ప్రకటించుకుంటే ఆ ప్రాంతాన్ని దేశంగా పరిగణించడం కుదరదు. ఇక ఇండియా సహాయం కోసం సోషల్ మీడియా ద్వారా వారు విన్నపాలు చేస్తున్న ఇప్పటికి ఇంకా ఇండియా మౌనంగానే ఉంది. ఒకవేళ బలూచి దేశ ఏర్పాటుకు ఇండియా సహకరిస్తే అంతర్జాతీయంగాను మద్దతు పెరగవచ్చు. ఐక్య రాజ్య సమితి కూడా దేశ ఏర్పాటు ప్రతిపాదనలకు సహకరించవచ్చు.
ఒక వైపు పాక్ తిక్క కుదిర్చినట్లవుతుంది. ఆర్థికంగా బలూచి పాక్ కు ఆయువు పట్టుగా ఉంది. అలా పాక్ ఆర్థిక మూలలను దెబ్బతీసినట్లువుతుంది. కాకపోతే అంతర్జాతీయ సమాజంలో భారత్ వేర్పాటు వాదన్ని ప్రోత్సహించిన దేశంగా కనిపిస్తుంది. అపుడు కాశ్మీర్ విషయంలో మనకు వ్యతిరేకంగా అభిప్రాయాలూ రావచ్చు. ఒకవేళ భారత్ బలూచి ఏర్పాటును వ్యతిరేకిస్తే ఐక్య రాజ్య సమితి సహకారం కూడా బలూచి లిబెరేషన్ ఆర్మీకి లభించకపోవచ్చు. బలూచి స్వత్రంత్ర దేశంగా ఏర్పాటు జరగపోతే బిఎల్ఏ కొద్ది కాలానికి బలహీన పడవచ్చు పాక్ ఆర్మీని నిలువరించేంత శక్తి బిఎల్ఏ కు లేదు. కాబట్టి ప్రస్తుతం పాక్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉండటం వల్ల పాకిస్తాన్ కు బలూచిస్తాన్ ను కట్టడి చేయడానికి సమయం దొరుకుతుంది. అయితే ప్రస్తుతానికి భారత్ బలూచి పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు వేచి చూడాలి.