ఒక ఉగ్రవాది తల్లి మాట వినలేదు…ఎన్‌కౌంటర్‌లో హతం..!

దక్షిణ కశ్మీర్ లోని పుల్వామాలోని త్రాల్ లో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసుల ఆపరేషన్ లో హతమయ్యే ముందు జైషే మహ్మద్ కు చెందిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాది అమీర్ నజీర్ వనీ తన కుటుంబానికి ఫోన్ చేశాడు…ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఒక ఉగ్రవాదిని వీడియో కాల్ లో అతని తల్లి లొంగిపోవాలని వేడుకుంది. ఎంత వేడుకున్నా అతడు తల్లి మాట వినలేదు. ఉగ్రవాది అమీర్ నజీర్ వాని తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు చేతిలో AK-47 పట్టుకుని కనిపించాడు. చివరి వీడియో కాల్‌లో, అమీర్ ను అతడి తల్లి లొంగిపోవాలని చెప్పింది, కానీ అతను నిరాకరించాడు. “సైన్యం ముందుకు రానివ్వండి, అది నేను చూస్తాను” అని అతను బదులిచ్చాడు.
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. థ్రాల్‌ ప్రాంతంలోని నదిర్‌ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మ‌హమ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థకు (Jaish-e terrorists) చెందిన ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. అయితే జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న చివ‌రి క్ష‌ణాల‌ను ఇండియ‌న్ ఆర్మీ విడుద‌ల చేసింది. డ్రోన్ ఫుటేజీను విడుద‌ల చేసింది. ఉగ్ర‌వాదుల‌ను డ్రోన్ స‌హాయంతో గుర్తించి, అక్క‌డ కూంబింగ్ నిర్వ‌హించి మ‌ట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్‌ అహ్మద్‌ షేక్‌, అమిర్‌ నజీర్‌ వనీ, యవర్‌ అహ్మద్‌ భట్‌ హతయ్యారు…

ఇదిలా ఉండగా.. షోపియాన్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్‌ ఉల్‌ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్‌, మ్యాగజైన్స్‌, గ్రెనేడ్స్‌ ఉన్నాయి..