*చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు: హైడ్రా రంగనాథ్
తెలంగాణ : చెరువుల్లో మట్టి, నిర్మాణ వ్యర్థాలు పోసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుని క్రిమినల్ కేసులు పెడతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. కాంట్రాక్టర్లు మట్టిని ఎక్కడ పోస్తే మాకేంటి అనేట్టు బిల్డర్లు వ్యవహరిస్తే అందరిపైనా కేసులు పెడతామన్నారు. చెరువుల్లో మట్టిపోస్తున్న వారి సమాచారాన్ని నం. 9000113667కు ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లతో రంగనాథ్ సమావేశం నిర్వహించారు.