అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు…

అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఒక సంతానోత్పత్తి క్లినిక్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) దీనిని ఉగ్రవాద దాడిగా గుర్తించింది. ఈ పేలుడులో ఒకరు మరణించారు, దాదాపు నలుగురు గాయపడ్డారు. ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని FBI చెబుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సంస్థ FBI లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్ తెలిపారు….
https://x.com/krassenstein/status/1923848832502145256?t=Pme1hAN9QNJQSWBP2AYSsA&s=19
అమెరికాలో బాంబు పేలుడు జరిగింది. దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ)!

అవును… అమెరికాలోని కాలిఫోర్నియాలో బాంబు పేలుడు సంభవించింది. ఇందులో భాగంగా.. పాంమ్మ్ స్ప్రింగ్స్ లోని ఓ హెల్త్ క్లీనిక్ సమీపంలో శనివారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. కనీసం ఐదుగురు గాయపడ్డారు! ఈ సంఘటనపై స్పందించిన ఎఫ్.బీ.ఐ… దీన్ని ఉద్దేశ్యపూర్వక ఉగ్రవాద చర్యగా పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన లాస్ ఏంజిల్స్ ఫీల్డ్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్ అకిల్ డేవిస్… అమెరికన్ రిప్రోడక్టివ్ సెంటర్స్ నిర్వహిస్తున్న క్లీనిక్ దగ్గర స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో అనుమానిస్తున్న ఓ వ్యక్తి అధికారుల అదుపులో ఉన్నాడని పేర్కొన్నారు!

ఇదే సమయంలో… ఇది ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్య అని చెప్పిన డేవిస్… అయితే, ఇది అంతర్జాతీయ ఉగ్రవాదమా.. లేక, దేశీయ ఉగ్రవాదమా అనేది ఎఫ్.బీ.ఐ. నిర్ణయిస్తుందని అన్నారు. ఆ ఘటన తర్వాత కనిపించిన వీడియోలో… క్లీనిక్ నుంచి దట్టమైన పొగ ఎగసిపడుతున్నట్లు కనిపిస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.