లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం… వీడు ఎంత దుర్మార్గుడంటే..!

* *🔹లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం..

* పాకిస్తాన్ లో ఖలీద్ ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు.
* లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పని చేస్తున్న సైఫుల్లా ఖలీద్.
* ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం.
* 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనక ఖలీద్.
* 2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర.
* 2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడు.
* చాలా కాలం పాటు నేపాల్ లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.
* ఇటీవల సింధ్ ప్రావిన్స్ లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చిన ఖలీద్…

పాక్ కేంద్రస్థానంగా పనిచేసే లష్కరే తొయిబా (Lashkar-e-Taibe) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబు సైఫుల్లా (Abu Saifullah) ఆదివారంనాడు హతమయ్యాడు. పాకిస్థాన్‌‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపినట్టు భద్రతా వర్గాలు తెలిపాయి. సైఫుల్లాకు వినోద్ కమార్, మొహమ్మద్ సలీమ్, ఖలీద్, వనియాల్, వాజిద్, సలీమ్ భాయ్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లష్కరే ఆపరేషన్లు, రిక్రూట్‌మెంట్ల నిర్వహణ, నిధుల సమీకరణ, సరిహద్దు చొరబాట్లలో సైఫుల్ కీలకంగా వ్యవహించే వాడు…

నేపాల్‌లో లష్కరే కీలక మాడ్యూల్‌గా సైఫుల్లా వ్యవహరించే వాడు. పోరస్ ఇండో-నేపాల్ సరిహద్దు గుండా టెర్రరిస్టులను భారత భూభాగంలోకి పంపేందుకు మార్గం సుగమం చేసేవాడు. లష్కరే తొయిగా, దాని పొలిటికల్ ఫ్రండ్ జమాత్ ఉద్ దవా (జేయూడీ)కి ఫండ్‌రైజర్‌గా వ్యవహరించేవాడు. పాక్‌లోని సింధ్‌ ప్రావిన్స్ బదిన్ జిల్లా మాట్లి తాలూకాలో సైఫుల్లా ఆదివారంనాడు గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో సైఫుల్లా హతమవడంతో లష్కరేకి గట్టి దెబ్బ తగిలినట్టయింది…

లష్కరే తోయిబా కమాండర్ పేరు సైఫుల్లా ఖలీద్ అలియాస్ వినోద్ కుమార్ అలియాస్ మహ్మద్ సలీం అలియాస్ వానియాల్ అలియాస్ వాజిద్ అలియాస్ సలీం భాయ్. అతను నేపాల్‌లో లష్కర్ మొత్తం మాడ్యూల్‌ను నిర్వహించేవాడు. ఈ ఉగ్రవాది ప్రధాన పని లష్కరే ఉగ్రవాద కార్యకలాపాలకు కేడర్లను అందించడం ఆర్థిక సహాయం చేయడం. 2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాద దాడికి కుట్ర పన్నింది ఈ గుంపునే.

రాంపూర్‌లోని CRPF శిబిరంపై దాడి, నాగ్‌పూర్‌లోని RSS ప్రధాన కార్యాలయంపై దాడి, బెంగళూరులోని IISc వద్ద బాంబు పేలుడుతో సహా భారత్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో సైఫుల్లా పాల్గొన్నాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాడిన్ జిల్లాలోని మట్లి తాలూకాలో ఆదివారం దీనిని కాల్చి చంపినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద నాయకుడు లష్కరే ఉగ్రవాదులను నేపాల్ ద్వారా భారతదేశంలోకి చొరబాట్లకు గురిచేసేవాడు. ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ఈ దాడులు అనేక మంది ప్రాణాలను బలిగొన్నాడు. భారత గడ్డపై లష్కరే తోయిబా కార్యకలాపాలు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాడు..