నేటి పంచాంగం…నేటి మాట…!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 20 – 05 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,

తిథి : *అష్టమి* రా12.14 వరకు,
నక్షత్రం : *ధనిష్ఠ* మ3.33 వరకు,
యోగం : *ఐంద్రం* రా11.17 వరకు,
కరణం : *బాలువ* మ12.51 వరకు,
తదుపరి *కౌలువ* రా12.14 వరకు,

వర్జ్యం : *రా10.32 – 12.06,*
దుర్ముహూర్తము : *ఉ8.04 – 8.55,*
మరల *రా10.48 – 11.33*
అమృతకాలం : *ఉ6.53 వరకు,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.30,
సూర్యాస్తమయం: 6.21,

*_నేటి మాట_*

*అద్వైత భావం*
ఈరోజు చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు వారి వారి ప్రసంగాలలో, అద్వైతం గూర్చి చాలా విషయాలు బోధించడం జరుగుతుంది..
కానీ కొందరు దీని యొక్క భావం తీసుకోవడం కాకుండా ఎలా ఆచరించాలో తెలుసుకోవడం లేదు…
మనము ఆచరించే కర్మలలో అద్వైతం కాదు, భావనలోనే అద్వైతం ఉండాలి

మన వివేకమును ఉపయోగించి మనము నిర్వర్తిస్తున్న వృత్తిని బట్టి ఏది ఉత్తమ మార్గమో నిర్ణయించు కోవాలి.

ఉదాహరణకు…
ఒక మంగలి అన్ని వస్తువులు సమానమని భావించి, తన కత్తి తో, కూరలు తరగడానికి, పెన్సిలు చెక్క డానికి, వెదుళ్లు నరకడానికీ పూనుకోరాదు, ప్రతీ వస్తువుకు, ఒక ప్రత్యేక బాధ్యత, శక్తి, ప్రయోజనం ఉంటుంది.

రాజును రాజు గానూ, రైతును రైతు గానూ మన్నించాలి.
చేప నీటిలోనే బతకగలదు, కానీ నీళ్ళ కంటే, పాలు విలువైనవి కనుక, పాలల్లో వేస్తే బతకదు… అలా వేయకూడదు కూడా…

“సర్వం బ్రహ్మమ యం” అన్నది నిజమే కానీ, వ్యవహారిక జగత్తు లో ఇది వర్తించదు…

కనుక మనము మన భావంలో, దైవస్వరూపులుగా, అందరినీ భావించాలి గానీ, కర్మలలో ఎవరితో యే విధంగా ఉండాలో అలాగే ఉండాలి!!…

వేయి ఆలోచనలు మన మనస్సు లోకి వస్తాయి కానీ, వాటి ఆచరణ మన అడుగుజాడలలో పడకూడదు.

*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏