ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలి
2025-26 విద్యా సంవత్సరానికి గాను సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలురు, బాలికల పాఠశాలలు, కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికపై ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా పనిచేసేందుకు గాను దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారిణి సిహెచ్. పద్మ తెలిపారు. అర్హత కలిగి అనుభవజ్ఞులైన, ఆంగ్లంలో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఈనెల 23వ తారీకు లోపు దరఖాస్తులను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని(ఇమాంపేట) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె తెలిపారు. బాలికల పాఠశాలల్లో బోధించడానికి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు వివరాలకు 9704550271, 8008995137 మొబైల్ నెంబర్లకు సంప్రదించాలని డి సి ఓ పద్మ తెలిపారు.