ఐపీఎల్ 2025లో భాగంగా 68వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును 110 పరుగుల తేడాతో దారుణంగా ఓడించింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది..ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఇది ఆరో విజయం.
13 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. లక్నో జట్టు తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు సన్‌రైజర్స్ ఆరో స్థానంతోనే సీజన్‌ను ముగిసింది. ఒకవేళ లక్నో తమ ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు సన్‌రైజర్స్ ఏడో స్థానంలో నిలుస్తుంది. ఇక హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన కోల్‌కతా ఎనిమిదో స్థానంతో సీజన్‌ను ముగించింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (105 నాటౌట్; 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (32; 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
IPL 2025.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా విఫలమైంది. 18.4 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్ నరైన్ (31 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీశ్ పాండే (37; 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబెలు తలా మూడు వికెట్లు తీశారు.
ఇక ఈ మ్యాచ్‌లో విజయం, సీజన్ లో తమ ఆటతీరుపై సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడాడు.ఈ సీజన్‌కు ఇది అద్భుతమైన ముగింపు అని చెప్పుకొచ్చాడు. సీజన్ ఆఖరిలో కొన్ని మ్యాచ్‌ల్లో చాలా బాగా ఆడామని, అన్ని చక్కగా కుదిరాయన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ చూడడానికి ఓ బౌలర్‌గా తనకు చాలా భయంగా ఉందన్నాడు..‘మా ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే మేము సీజన్ ఆరంభంలో అలా ఆడి ఉండకూడదు. ఖచ్చితంగా మేము ఫైనల్స్‌కు వెళ్లాల్సి ఉంది. ఇలాంటి వికెట్ ఉంటే.. మేము ఈజీగా 250 నుంచి 260 పరుగులు చేస్తాము. అయితే.. కొన్ని సార్లు మేము 170 పరుగులు కూడా చేయలేకపోయాము. ఈ సీజన్లో చాలా మందికి అవకాశాలు వచ్చాయి. జట్టును ఎంచుకునేటప్పుడు మేము ప్రతీది పరిశీలిస్తాము. గాయాల వల్ల చాలా మంది ఆటగాళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఈ సీజన్లో మేము 20 మంది ఆటగాళ్లను ఉపయోగించుకున్నాము.’ అని కమిన్స్ తెలిపాడు..
కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలం
279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కేకేఆర్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. సునీల్ నరైన్ కొన్ని శక్తివంతమైన షాట్లు కొట్టాడు కానీ 16 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. క్వింటన్ డి కాక్ కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే కూడా బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. 15 పరుగులు చేసిన తర్వాత జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్లను హైదరాబాద్ బౌలర్ హర్ష్ దుబే రెండు బంతుల్లోనే పెవిలియన్‌కు వెనక్కి పంపాడు. రింకు 9 పరుగులు చేయగా, రస్సెల్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ కూడా కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.
110 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయిన తర్వాత, మనీష్ పాండే, హర్షిత్ రాణా బాధ్యత తీసుకుని కొన్ని శక్తివంతమైన షాట్లు కొట్టారు. మనీష్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. వైభవ్ అరోరా ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా 21 బంతుల్లో 34 పరుగులు చేయడంతో కేకేఆర్ 168 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున జయదేవ్ ఉనద్కట్, హర్ష్ దుబే, ఇషాన్ మలింగ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
క్లాసెన్-హెడ్ విధ్వంసం
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు కేవలం 6.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు. అభిషేక్ 16 బంతుల్లో 32 పరుగులు చేయగా, హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యారు. తన ఇన్నింగ్స్‌లో, హెడ్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత క్లాసెన్ బ్యాటింగ్ ఆర్డర్లో పదోన్నతి పొంది మూడో స్థానంలో వచ్చాడు. క్లాసెన్ వచ్చిన వెంటనే, హెడ్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ తరపున క్లాసెన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్ 39 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అదే సమయంలో, ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 29 పరుగులు చేశాడు, దీని కారణంగా హైదరాబాద్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేయగలిగింది.చాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా మూడో వేగవంతమైన సెంచరీ..