సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది..
చందుర్తి పోలీస్ స్టేషన్కు సమీపంలో మనోజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ (60)ను అతికిరాతకంగా హత్య చేశాడు.
అనంతరం వేట కొడవలితో పోలీస్టేషన్ వెళ్లి ‘పెద్దమ్మ గుడి వద్ద ఆమె తల, చేతులు నరికి చంపేశా సార్” అని చెప్పాడు.
దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. గతేడాది వినాయక చవితి రోజు కూడా మనోజ్ ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తెలుస్తోంది..