భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు.నాకు యుద్ధం ఆలోచన వస్తే ఆ రెండు దేశాలు గుర్తుకు వస్తాయి…!.

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం భారత్ హక్కు అని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఇటలీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇటలీ ప్రభుత్వం నివాళులు అర్పించడంపై ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు దిల్లీలోని ఇటలీ ఎంబసీలో ఉగ్రవాదం, పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు..పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని మరోసారి ఇటలీ వేదికగా ఆయన సమర్థించారు. అత్యంత కచ్చితత్వంతోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. టెర్రరిజం నుంచి తమ ప్రజలను రక్షించుకోవడం భారత్ హక్కు అని జై శంకర్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ చర్యను ప్రపంచ దేశాలు హర్షించాయని అన్నారు..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో భారత్ కు సపోర్ట్ గా ఇటలీ ప్రభుత్వం నిలిచిందని జై శంకర్ గుర్తుచేశారు. ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. భారత్- ఇటలీ మధ్య సంబంధాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని.. మున్ముందు బలంగా కొనసాగుతాయని అన్నారు. ఇటలీ నేషనల్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు..భారత్- ఇటలీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ముఖ్యంగా వ్యాపారం, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల మధ్య అవగాహన మరింత దృఢంగా ఉండాలని ఎస్ జై శంకర్ స్పష్టం చేశారు. అంతేకాక ‘మీకు యుద్ధం అంటే ఉక్రెయిన్ గుర్తొస్తుంది.. రూల్స్ మాట్లాడుతారు కానీ.. ఉక్రెయిన్ కే మద్దతు ఇస్తారు.. కానీ నాకు యుద్ధం ఆలోచన వస్తే పాకిస్థాన్, టెర్రరిజం, చైనా గుర్తొస్తాయి. అవి రూల్స్ ను ఉల్లంఘిస్తున్నాయి. అందుకే మీ దృక్పథం వేరు.. మా దృక్పథం వేరు’ అని జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.