నేటి పంచాంగం…నేటి మాట..!

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏.
🏵️పంచాంగం🏵️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 05 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *తదియ* రా2.59 వరకు,
నక్షత్రం : *ఆర్ద్ర* రా2.23 వరకు,
యోగం : *శూలం* రా7.12 వరకు,
కరణం : *తైతుల* మ1.51 వరకు,
తదుపరి *గరజి* రా2.59వరకు,

వర్జ్యం : *ఉ11.25 – 12.57,*
దుర్ముహూర్తము : *ఉ9.48 – 10.39,*
మరల *మ2.58 – 3.50,*
అమృతకాలం : *రా4.47 – 6.19,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.29,
సూర్యాస్తమయం: 6.26,

*_నేటి మాట_*

*భక్తుడు – భగవంతుడు*
_భక్తునికి రాముడు తానే, యముడు తానే, ఇది సత్యం!!_
భక్తులను రక్షించే సమయంలో ఆయన రాముడవు.
దుష్టుల ను శిక్షించే సమయంలో ఆయన యము డవు…
“ప్రహ్లాదుని పాలిట ఆయన నారాయణుడు , హిరణ్యకశిపుని పాలిట ఆయన యముడు…

అంటె…!!
మనం ఆ దేవుడిని కొలుస్తాం, ఈ దేవుడిని విమర్శిస్తుంటాం!!…
ఇది సరిఅయిన పద్ధతి కాదు కదా!!
దేవుడు ఎవరికైనా దేవుడే, భగవంతుడు అనే పదాన్ని విమర్శించే హక్కు మానవునికి లేదు,
అందుకే కొన్ని కొన్ని కష్టాలు కోరి తెచ్చుకుంటాము,
“భగవంతుడు మంచికి సహాయం చేస్తున్నాడు, చెడును శిక్షిస్తున్నాడు అని అర్థం…

అలానే…!!
భగవంతుణ్ణి ఎవరైనా విమర్శ స్తుంటే వారికంటె వేరే యమదూత లేడు, భగవంతుని కి దూరమైతే, అంతకంటె నరకం మరొకటి లేదు.
” దేవుణ్ణి తలవని వారు లోకంలో ఎంతోమంది లేరా” , అని వాదించవచ్చు.
కానీ వారు మానసికంగా చాలా హీనంగా, గమ్యం అనేది లేకుండా జీవితం గడుపుతున్నారు.
మనుష్యులు గా బ్రతకాలి, భక్తులు గా పవిత్రులుగా రూపొందాలి.
భగవంతుని అనుగ్రహం పొందడానికి పాటుపడాలి.

*_🏵️శుభమస్తు 🏵️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏