చిరకాల కల ఐపీఎల్ ట్రోఫీ సాధన కోసం జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడుతున్నాయి…18 ఐపీఎల్స్ నుంచి ఆశగా ఎదురు చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ కల ఇన్నాళ్లకు నెరవేరింది..బెంగళూరు అభిమానులకు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ విరాట్ కోహ్లీ అభిమానులకు ఉంది. వారి నిరీక్షణ ఫలించింది. 2025 ఐపీఎల్ ఛాంపియన్‌గా బెంగళూరు ట్రోఫీని ఎత్తుకుంది.
అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది. మొదటి బంతి నుంచి చివరి వరకు ఉత్కంఠగా సాగిందీ మ్యాచ్. పలు మార్లు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతూ వచ్చింది. చివరకు బెంగళూరుకు విజయం వరించింది.
పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. మొదట్లో ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా తర్వాత నెమ్మదించింది. ఈ పిచ్‌పై 200 పరుగుల కంటే తక్కువ చేస్తే విజయం సాధించడం కష్టమని తెలిసినప్పటికీ 190 పరుగులను జాగ్రత్తగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో స్లోగా ఆడాడనే అపవాదుల మూటకట్టుకున్న విరాట్ కోహ్లీ ఇన్నింగ్సే ఇప్పుడు ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 43 పరుగులు మాత్రమే చేశాడు..
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు లక్ష్యం ఛేదించలేకపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ అత్యధికంగా 43 పరుగులు సాధించాడు.
191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది..
అంతకుముందు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లు మొదటి వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం అందించారు.
19 బంతుల్లో 24 పరుగులు చేసిన ప్రియాంశ్ ఐదో ఓవర్లో హేజిల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్.. ప్రభ్‌సిమ్రన్‌కు జతకలవడంతో స్కోరు బోర్డు ముందుకు సాగింది.
కాగా, తొమ్మిదో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్(26), పదో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(1) ఔటయ్యారు.
పది ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది..
పంజాబ్ బౌలింగ్‌తో బెంబేలు
తమకు కూడా తొలి ట్రోఫీ కావడంతో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కసితీరా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే మొదలుకుని ఆఖరి ఓవర్ వరకు పకడ్బందీ బౌలింగ్ వ్యూహంతో బెంగళూరు బ్యాటర్లను ఎక్కడా కూడా భారీ స్కోర్ చేయనివ్వలేదు. పరుగులను మరికొంత నియంత్రించాల్సి ఉన్నా వికెట్లు మాత్రం టపాటపా తీశారు. మొదట టాపార్డర్‌ను దెబ్బతీసి బెంగళూరు బ్యాటింగ్ దళం నీరుగార్చారు. అనంతరం మిడిలార్డర్ బ్యాటర్లపై కూడా అదే వ్యూహంతో బంతులు వేసి స్కోర్‌ను 200 దాటించలేదు. అర్ష్‌దీప్ సంచలన ప్రదర్శన కనబర్చి కీలకమైన మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని భారీ దెబ్బతీశాడు. కేల్ జేమిసన్ కూడా అదే పదునైన బంతులతో బెంగళూరు బ్యాటింగ్ దళం నడ్డి విరిచాడు. అజ్ముత్లా ఒమర్ జాయ్, వైశాక్ విజయ్ కుమార్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఇంకాస్త పకడ్బందీ బౌలింగ్ వేస్తే బ్యాటర్లు ఛేదించడానికి సులువయ్యేదనే అభిప్రాయం వ్యక్తమైంది..