స్టేడియం దగ్గర సరైన సమయంలో గేట్లు తీయకపోవడమే తొక్కిసలాటకు ముఖ్య కారణం…వైరల్ గా మారుతున్న వీడియో..!!?
ఆర్సిబి విక్టరీ సంబరాలను చూసేందుకు వచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసులాట జరిగింది. ఈ ఘటనలో 11 మందికి పైగా మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఆర్సిబి టీమ్ సన్మాన కార్యక్రమాన్ని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
తమ అభిమాలను చూసేందుకు భారీ సంఖ్యలో అక్కడికి అభిమానులు తరలిరాగా స్టేడియం గేట్లను తోసుకొని మరి అభిమానులు ముందుకు వెళ్లినట్లుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ తొక్కి సలాటలు జరిగినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. స్టేడియం దగ్గరికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం తెలుసుకునే లోపే తొక్కిసలాట జరిగిపోయింది అంటూ పోలీసులు సైతం తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఊపిరాడక అక్కడ కొంతమంది మరణించారని స్టేడియం దగ్గర సరైన సమయంలో గేట్లు తీయకపోవడమే తొక్కిసలాటకు ముఖ్య కారణం అన్నట్లుగా తెలియజేస్తున్నారు.
ఇలా ఆలస్యం కావడంతో అభిమానులు గేట్లు తోసుకుంటూ దూసుకుపోయారని తెలియజేస్తున్నారు. ఆ క్రౌడ్ ను తాము అదుపు చేయలేకపోయాం అంటూ పోలీసులు కూడా వెల్లడిస్తున్నారు. కేవలం పాసులు ఉన్నవారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తామంటూ అధికారులు చెప్పిన కానీ అభిమానులు అంతకుమించి రావడంతో స్టేడియం పరిసరాలలో జన సమూహం కూడా పెద్ద ఎత్తున ఉండడంతో వారిని అదుపు చేయడం సాధ్యం కాలేకపోయింది అంటూ తెలుపుతున్నారు. అయితే తొక్కిసలటం జరగడంతో స్టేడియం నుంచి అభిమానులను పంపించేశామంటూ తెలిపారు. అంతేకాకుండా చిన్నస్వామి స్టేడియంలో మెట్రో వంటి సేవలను కూడా నిలిపివేసినట్లుగా తెలియజేశారు. అయితే కొంతమంది ప్రాణాలను కాపాడలేకపోయాం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది…
https://x.com/pranooth_mp/status/1930228879026745400?t=qn7KyfObdVDHsV8bBeIhQg&s=19
విరిగిపోయిన గేట్లు
స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు దాదాపు 5 వేల మంది పోలీసులు మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు పొటెత్తడంతో వాళ్లని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. గేట్లు చిన్నగా ఉండటంతో అభిమానులు లోపలికి సులభంగా వెళ్లలేకపోయారు. ఆ గేట్లు చిన్నగా ఉండటంతో అవి విరిగిపోయాయని రద్దీ ఎక్కువ కావడంతో ఈ ఘటన సంభవించిందని భావిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే పాస్‌లు ఉన్నాకూడా మమ్మల్ని లోపలకి రానీయలేదని కొందరు అభిమానులు చెబుతున్నారు.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ(అసెంబ్లీ) నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని ఆర్సీబీ టీమ్ నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారీగా వస్తారని అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం స్డేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన విడుదల చేసింది. పరేడ్‌ను నిర్వహిస్తామని కానీ అభిమానులు గైడ్‌లైన్స్‌ను పాటించాలని చెప్పింది. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. పరేడ్ ఎటువైపు ఉంటుందో తెలియక.. చాలామంది స్టేడియం లోపలికి వెళ్లేందుకే ఆసక్తి చూపారు. కొందరు పాస్‌లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వాళ్లని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితులు ఉద్రిక్తంగా మారినట్లు సాక్షులు తెలిపారు…