*జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్*
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన కన్నుమూశారు. 2014, 2018, 2023లో మూడు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మాగంటి గోపీనాథ్ మృతితో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు, పలువురు BRS నేతలు హుటాహుటిన AIG ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు…
అయితే, తాజా సమాచారం ప్రకారం గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఈ రోజు మరింత విషమించినట్టు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు తక్షణమే ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని హరీష్ రావు మీడియాతో వెల్లడించారు.
ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారు, చికిత్సకు స్పందిస్తున్నట్టు కూడా ఆయన తెలిపారు.