గృహ వినియోగదారులకు ఊరట..
_• మరోసారి రేపో రేట్ తగ్గించిన ఆర్బీఐ._
_• 50 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం._
_• తగ్గనున్న గృహ వాహన వస్తు వ్యక్తిగత రుణాల నెలసరి వాయిదాల మొత్తం._
_• దేశవ్యాప్తంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం.
నెలనెలా ఈఎంఐ చెల్లింపులతో కష్టపడుతున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) మరోసారి శుభవార్త అందించింది.
కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా మరింత ఉపశమనం కలిగించింది.
ఆర్బీఐ ఇలా రెపోరేటును సవరించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కాగా.., మొత్తం కలిపి ఇప్పటి వరకు 1 శాతం వరకు తగ్గింపును నమోదు చేసింది.
తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం మరింత తగ్గే అవకాశముంది..
RBI Monetary Policy …రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి చేరనుంది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు ఒక శాతం మేర తగ్గింది.
సర్దుబాటు వైఖరి నుంచి స్థిర విధానానికి!.
మరోవైపు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతంగా ఉంచిన ఆర్బీఐ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.75 శాతంగా ఉంచింది. ఈ విధంగా ద్రవ్య పరపతి విధాన కమిటీ సర్దుబాటు వైఖరి నుంచి స్థిర విధానానికి మారాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు..