🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 10 – 06 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చతుర్దశి* ఉ10.47 వరకు,
నక్షత్రం : *అనూరాధ* సా5.44 వరకు,
యోగం : *సిద్ధం* మ1.57 వరకు,
కరణం : *వణిజ* ఉ10.47 వరకు,
తదుపరి *భద్ర* రా11.35 వరకు,
వర్జ్యం : *రా11.49 – 1.34,*
దుర్ముహూర్తము : *ఉ8.04 – 8.56,*
మరల *రా10.52 – 11.36,*
అమృతకాలం : *ఉ6.17 – 8.03,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం: 6.29,
*_నేటి మాట_*
*ధ్యానము*
ఈరోజు చాలా మంది భక్తులు మాకు ధ్యానం సరిగా కుదరడం లేదు, మేము సరిగా చేయలేక పోతున్నాము అని వాపోతుంటారు.
అందుకు ముఖ్యంగా ” సర్వ జనులయందు సమాన ప్రేమ ఉన్నవారికి, ధ్యానము , శాంతముగా సాగును. ”
కటిక చీకటిలో నావికులకు, సముద్ర మధ్యమున త్రోవ చూపుటకు దీపస్తంభము వలె,
జీవన్ముక్తులైనవారు, అంధకారము నందు మునిగి దారి తెలియని వారికి, దారి చూపు చున్నారు.
అందరూ ఒక్క భగవంతుని ఉదరమందున్నవారే.
అజ్ఞాన మనుష్యులలో కూడా కొంతమంది, జ్ఞానులు యోగులు కలరు.
అజ్ఞానులవలె కూడ ఇట్టి జనులు కలిసి యుండుటచేత, ఎవరు జ్ఞానులు, ఎవరు అజ్ఞానులు అనునది తెలిసికొనుట, కష్టము.
నెత్తురునందు తిరుగు ఎఱ్ఱని పురుగులను చూడవలెనన్న, భూతద్దం సహాయము లేనిదే తెలియ రావు.
కనుక, అట్టి జ్ఞానులను స్థూల రూపమును చూడవలెనన్న, వారిని చూచు భూతద్దము కావలయును.
ఆ అద్దమే ఈ ధ్యానము, ఇప్పటి ప్రకృతి వాతావరణ మును బట్టి చూడ, ప్రకాశము చూపువారు చాలా తక్కువ గా ఉన్నారు.
కానీ, వీరిని, వారినీ, ఆశ్రయించుట కంటె, పరమాత్మ పైనే సంపూర్ణ ప్రేమ, విశ్వాసమును పెట్టి, గురువు, దైవము, తల్లి, తండ్రి, సర్వమును నీవేయని, భగవంతుని ఆశ్రయించిన, ఏ త్రోవనూ తప్పరు.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏