జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి-ఆదినారాయణరెడ్డి…
నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది…
అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి…
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి..
లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఒకే దేశం – ఒకే ఎన్నిక బిల్లు ఎట్టకేలకు పార్లమెంటు ముందుకు వచ్చింది. చాలా కాలంగా తర్జన భర్జనలు చేసిన కేంద్రం డిసెంబర్ 17వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు’ను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభ ముందుకు తీసుకొచ్చారు. మొదట ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించిన క్రమంలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఓటింగ్ నిర్వహించారు. లోక్సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు వచ్చాయి..
2027లో ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ మేరకు అన్ని పార్టీలను ఒప్పించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. అంటు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు…