మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు యావత్ దేశంలో సంచలనం రేపింది. హనీమూన్ పేరుతో షిల్లాంగ్‌కు తీసుకెళ్లి భర్తను భార్యే చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది..ఒకానొక సమయంలో తాము అలసిపోయామని, హత్య చేయలేము అని హంతకులు చెప్పినా సోనమ్ వినిపించుకోలేదట. అంతేకాదు తన భర్తను చంపేస్తే 20లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట.
Honeymoon murder
తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు సోనమ్ రఘువంశీ రూ.4 లక్షలు ఆఫర్ చేసిందని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచిందని విచారణలో తెలిసింది. పోలీసు ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయలోని ఒక లోయలోకి నెట్టడంలో నిందితులకు సోనమ్ సాయం చేసిందట.
జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో (చిరపుంజి అని కూడా పిలుస్తారు) ఒక జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై కనిపించాడు.
సోనమ్ నియమించుకున్న సుపారీ హంతకులు మొదట బెంగళూరులో నూతన వధూవరులను కలిశారు. అక్కడి నుండి వారు ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో ప్రయాణించారు. మృతుడు, నిందితులు ఒకే నగరానికి చెందిన వారు కావడంతో వారు మాట్లాడుకున్నారు.
”మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. హనీమూన్ కోసం మేఘాలయకు వన్-వే టికెట్ ప్లాన్ చేయడం అందులో భాగమే. రాజ్ కుష్వాహా మేఘాలయకు ప్రయాణించకపోయినా, నిత్యం సోనమ్‌తో టచ్‌లో ఉంటూ తెర వెనుక ప్రణాళిక రచించాడు” అని పోలీసులు తెలిపారు.
నిందితులు మొదట మే 21న నూతన వధూవరులను గౌహతిలో అనుసరించారు. వారి హోటల్‌కు దగ్గరగా బస చేశారు. తర్వాత మే 22న షిల్లాంగ్‌కు వెళ్లారు. మరుసటి రోజు వారు రాజాను హత్య చేశారు. మే 23న, సోనమ్, రాజా రఘువంశీ జలపాతాన్ని చూడటానికి నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. హంతకులు వారిని ఫాలో అయ్యారు. ఒక సమయంలో, సోనమ్ అలసిపోయినట్లు నటించింది. తన భర్త, హంతకులకు చాలా దూరంగా నడవడం ప్రారంభించింది. వారు నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, సోనమ్ తన భర్తను చంపమని ఆ వ్యక్తులను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే, తాము అలసిపోయామని, రాజాను చంపడానికి హంతకులు నిరాకరించారని తెలుస్తోంది. ఎలాగైనా భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న సోనమ్.. తన ఆఫర్ ను 20 లక్షలకు పెంచారని వారు చెప్పారు. అంతేకాదు రాజా మృతదేహాన్ని పడవేయడంలో సోనమ్ నిందితులకు సాయం చేసిందని తెలుస్తోంది. ప్రాథమిక శవపరీక్ష నివేదిక ప్రకారం రాజా రఘువంశీ తల వెనుక, ముందు భాగంలో గాయాలు ఉన్నాయి…
ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ చివరిసారిగా తన అత్తతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బయటికి వచ్చాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తన కోడలు సోనమ్ రఘువంశీతో ఫోన్లో మాట్లాడింది. ముందుగా ‘రాజా ఫోన్ పనిచేస్తోందా..’ అని ఉమా రఘువంశీ ప్రశ్నించింది.
అందుకు సోనమ్ రఘువంశీ పొంతన లేని సమాధానం చెప్పింది. ‘మేం ఇప్పుడు ఎత్తైన కొండ ఎక్కుతున్నాం. పైకి చేరుకున్న తర్వాత మళ్లీ ఫోన్ చేస్తాం’ అని సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత వాళ్లు ఉమా రఘువంశీకి ఫోన్ చేశారా లేదా అనేది తెలియదు. అయితే సోనమే ఈ హత్య చేయించిందని నిరూపించడానికి ఈ ఫోన్ కాల్లో రెండు క్లూస్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
‘రాజా ఫోన్ పని చేస్తోందా..’ అని అతడి తల్లి అడిగిన దానికి సోనమ్ నేరుగా సమాధానం చెప్పకపోవడం మొదటి క్లూ అని, కొడుకు ఫోన్ కలవకపోవడంతో అతడితో మాట్లాడేందుకు తల్లి కోడలుకు ఫోన్ చేసినా.. కోడలు సోనమ్.. భర్తకు ఫోన్ ఇవ్వకుండా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పడం రెండో క్లూ అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ ఫోన్ మాట్లాడే సమయానికే రాజా రఘువంశీ హత్య జరిగిందా.. లేదంటే ఆ తర్వాత జరిగిందా అనేది తెలియాల్సి ఉందన్నారు.
ఆ ఫోన్ కాల్లో ‘ఈ రోజు నీకు ఉపవాసం కదా.. ఏమైనా తిన్నావా..?’ అని అత్త ప్రశ్నించగా ‘లేదు ప్రయాణం కారణంగా ఏమీ తినలేకపోయాను’ అని సోనమ్ బదులిచ్చింది. ఇప్పటికైనా ఏమైనా తినమని అత్త సూచించగా.. ఇక్కడ ఏమీ దొరకవని సోనమ్ చెప్పింది. సోనమ్ ఎగపోస్తున్నట్లు గమనించిన అత్త ఏమైందని ఆరా తీయగా పెద్ద కొండ ఎక్కుతున్నామని కోడలు జవాబిచ్చింది.
‘దాంతో అంత పెద్ద కొండపైకి ఎందుకు వెళ్తున్నారు..? దూరం నుంచి చూడొచ్చుగా..’ అని ఉమా రఘువంశీ అడుగగా.. ‘మేం వాటర్ ఫాల్ చూడటానికి వెళ్లాం. నేను కూడా వద్దని చెప్పాను. కానీ ఆయనే వినలేదు’ అని సోనమ్ బదులిచ్చింది. ఆ తర్వాత ఉమా రఘువంశీ ఎంత ప్రయత్నించినా ఇద్దరి ఫోన్లు కలవలేదు. జూన్ 2న ఓ లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది..
లోతుగా దర్యాప్తు చేయగా..
హనీమూన్ నిమిత్తం మేఘాలయకు వెళ్లిన సోనం, రఘు వంశీ కనిపించకుండా పోవడం కలకలం కలిగించింది. అయితే మొదట్లో పోలీసులకు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే సోనమ్ మీద పోలీసులకు అనుమానం కలిగిందో.. అప్పటినుంచే లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు.. అనంతరం ఈ వ్యవహారంలో సోనమ్ పాత్ర ఉందని పోలీసులకు తెలియడంతో ముందుగా ఆమెను మేఘాలయ నుంచి అనంతరంపాట్నా తీసుకెళ్లారు. అక్కడి నుంచి పుల్వారి పోలీస్ స్టేషన్లో ఆమెను ఉంచారు.. ఇక ఆమెను పాట్నా నుంచి గౌహతి విమాన మార్గంలో తీసుకెళ్తారు. అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లి కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది..
ప్రియుడితో కలిసి..
సోనమ్ కు రఘు వంశీకి ఇటీవల వివాహం జరిగింది హనీమూన్ నిమిత్తం వారు మేఘాలయ వెళ్లారు. అక్కడే ఆమె తన ప్రియుడు రాజ్ ను కలుసుకుంది. తన భర్తను అడ్డు లేకుండా చేసేందుకు రాజ్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది. ఆ తర్వాత ఆమె మాయమైంది. కొద్ది రోజులకే రఘు వంశీ విగత జీవుడిగా కనిపించాడు.. అయితే ఈ వ్యవహారంపై మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు జరిపారు.. టూరిస్ట్ గైడ్, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ డేటా మొత్తం పరిశీలించారు. పోలీసుల విచారణలో సోనమ్ ఒక రేంజ్ లో యాక్టింగ్ చేసింది. తను అమాయకురాలినని.. తనను ఎవరో అపహరించారని కట్టుకథలు చెప్పింది. కానీ ఎప్పుడైతే పోలీసులు తమ స్థాయిలో విచారించారో అప్పుడే నిజం బయటికి వచ్చింది.
లొకేషన్ కూడా పంపించింది..
రఘు వంశి ఇండోర్ ప్రాంతంలో రవాణా వ్యాపారం చేస్తుంటాడు. సోనం ను అతడు మే 11న వివాహం చేసుకున్నాడు. మే 16న సోనం రఘు వంశీ హత్యకు ప్రియుడు రాజ్ తో కలిసి ప్రణాళిక రూపొందించింది.” వాడు చనిపోతే నేను వితంతువు అవుతాను. అప్పుడు మన పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారని” సోనం చెప్పడంతో రాజ్ దానికి ఒప్పుకున్నాడు.. రఘువంశీని అంతం చేయడానికి ఆన్ లైన్ లో ఒక ఆయుధాన్ని వారిద్దరు తెప్పించారు. ఇక హత్యకు పాల్పడే ముందు నిందితులు ఒక హోటల్లో బస చేశారు. కాదు వారికి లోకేషన్ కూడా సోనం పంపించడం విశేషం.
ఫోటోషూట్ పేరుతో..
ఇక మే 23న ఫోటోషూట్ పేరుతో రఘువంశీని సోనం మేఘాలయలోని ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లింది. కొంత సమయం తర్వాత కతం చేయండి అంటూ గట్టిగా అరిచింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా రఘువంశీని అంతం చేశారు.. అయితే ఈ దారుణానికి ఒడి కట్టడానికి నిందితులు ఒప్పుకోలేదు. అయితే సోనం 20 లక్షలు ఇస్తానని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. ఈ ప్రమాదం తర్వాత సోనం ఘాజీపూర్ ప్రాంతానికి వెళ్ళింది. మార్గమధ్యలో తన ఫోన్ ధ్వంసం చేసుకుంది. అయితే పోలీసులు సిసి టీవీని పరిశీలించడంతో సోనం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సోనమ్ నిందితులతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి.. కాల్ ట్రేసింగ్ ఆధారంగా రాజ్ వ్యవహారానికి కూడా పోలీసులు బయటపెట్టారు..
బాధిత కుటుంబం దిగ్భ్రాంతి
ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి రావడంతో సోనం సైలెంట్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలోకి వెళ్లి లొంగిపోయింది.. అయితే రఘు వంశీ ని అంతం చేసిన రాజ్.. అతని అంత్యక్రియలో పాల్గొని చివరి తతంగాలు జరిపించడం విశేషం. అంతేకాదు రఘు వంశీ మామ దవిసింగ్ ను అతడు ఓదార్చినట్టు నటించాడు.. అయితే ఈ దారుణం తెలుసుకున్న రఘు వంశీ కుటుంబీకులు దిగ్బ్రాంతి చెందుతున్నారు..