‘బనకచర్ల’పై ఇప్పటికే అభ్యంతరాలు తెలిపాం: మంత్రి ఉత్తమ్
TG: బనకచర్ల ప్రాజెక్టుపై చట్టపరంగా ముందుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. నదీ జలాల హక్కుల విషయంలో గత BRS ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు. జగన్, కేసీఆర్ మధ్య అవగాహనతో నీటిని ఏపీకి దోచిపెట్టారని ఆరోపించారు.