నేటి పంచాంగం.. నేటి విశేషం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☀️పంచాంగం☀️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 15 – 06 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,

తిథి. : *చవితి* మ2.12 వరకు,
నక్షత్రం : *శ్రవణం* రా11.46 వరకు,
యోగం : *ఐంద్రం* ఉ11.53 వరకు,
కరణం : *బాలువ* మ2.12 వరకు,
తదుపరి *కౌలువ* రా1.50 వరకు,

వర్జ్యం : *తె3.44 – 5.19*
దుర్ముహూర్తము : *సా4.46 – 5.38,*
అమృతకాలం : *మ1.15 – 2.52,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.29,
సూర్యాస్తమయం: 6.31,

*_నేటి మాట_*

*సత్యము – నిజమునకు బేధం ఏమిటి??*
భూత భవిష్యద్వర్తమానములందు మారనిదే సత్యము,

ఈనాడు సత్యానికి చాలా విధములైనటువంటి భాష్యములు చెబుతున్నారు.
ఉన్నది ఉన్నట్లు, విన్నది విన్నట్లు, చూచినది చూసినట్లు చెప్పటం సత్యమనుకుంటున్నారు, ఇది నిజమైన సత్యం కాదు.
సత్యమనగా త్రికాలభాద్యమ్ సత్యమ్’, భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు మారనటువంటిదే సత్యము. దానినే transparent truth అంటారు.

ఈనాడు జగత్తులో చూచినటువంటిది, బాహ్యమైనటువంటి సత్యము.
సామాన్యమైనటువంటి, ప్రాకృతమైనటువంటి సత్యము.
ఆధ్యాత్మికమైనటువంటి సత్యము ఆత్మ.
ఆదే మన నిజమైనటువంటి సత్యము.
అక్కడనుండి ఆ conscience నుండి రావాలి, ఈ conscience యెక్కడనుండి వచ్చింది? దీనినే awareness అంటారు.
ఈ conscious, consciousness నుండి వచ్చింది.
ఈ consciousness సర్వత్రా నిండినటువంటిది, దీనినే భగవద్గీత ‘సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వ మావృత్య తిష్టతి’ అని వర్ణించింది.

భూత, భవిష్యత్ వర్తమానములలో మారనటువంటిది సత్యము.
ఉన్నది ఉన్నట్లు, విన్నది విన్నట్లు, చూచినది చూచినట్లు చెప్పడం కేవలము నిజం.
నిజమనగా నీవు చూచినప్పుడు యేవిధముగా వుండునో ఆ వున్నదానిని వర్ణించటం.
నిజాన్ని సత్యమనటం సరికాదు.
*Truth is GOD* ఈ సత్యము హృదయము నుండి రావాలి.

*_☀️శుభమస్తు☀️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏