రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు APలోని శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. TGలోని సిద్దిపేట, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.