సీఎం రేవంత్ రెడ్డి మాధిరిగానే బీర్ల ఐలయ్య నిన్న జరిగిన ఆత్మహత్యను పక్క దారి పట్టించడానికే ప్రయత్నం చేస్తున్నారు. ..గొంగిడి మహేందర్ రెడ్డి..
యాదాద్రి భువనగిరి జిల్లా:
యాదగిరిగుట్ట పట్టణంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్..
కర్రె వెంకటయ్య శాంతియుత వాతావరణంలో నిరసన చేసిన తీరు రజకార్లను తలపిస్తుంది.
బీర్ల ఐలయ్య ఇంట్లో జరిగిన సంఘటనను పక్కదారి పట్టించేందుకు వెంకటయ్యపై దాడి చేశారు.
ప్రజలంతా ఇంటికి వెళ్లిన తరువాత 200మంది పోలీసులు వెంకటయ్యను గుంజుకెళ్లారు.
పదేళ్ళు నియోజకవర్గానికి ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్యే గా పని చేశామని, ఎక్కడ కూడ ఇలాంటి దౌర్జన్యం చేయలేదు.
బీర్ల ఐలయ్య నీ ఇంట్లో జరిగిన సంఘటన పై ప్రజలకు వివరణ ఇవ్వులని అన్నారు.
కమిషనర్ ను నిన్న జరిగిన సంఘటనపై కలిసేందుకు వెళ్లాం.
ఆత్మహత్య పై అనేక రకమైనా చర్చ జరుగుతుంది. ప్రజా ప్రతినిధిగా దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత విప్ బీర్ల ఐలయ్య ఇవ్వాలి.
రాత్రి 9:30గంటలకు మరణిస్తే.. పోలీసులు వెళ్లింది 10:30గంటలకు వెళ్లి, రాత్రికి రాత్రే పంచనామ చేసి, 11గంటలకు భువనగిరికి ఎందుకు అప్పటికప్పుడే తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాం.
హైద్రాబాద్ లోని మినిస్టర్ క్వాటర్ లోని 27లో మరణించారని తెలుస్తుందన్నారు.
లోకల్ పోలీసులతో విచారణ చేయిస్తే సరిగ్గా చేయరు.. కమిషనరేట్ పరిధిలో నిజాయితీగల గల అధికారితో నిజనిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
మల్లాపురం గ్రామంలో కాలేజ్ పెట్టాలని కోరడం తప్పా.
ఎమ్మెల్యే ఏదీ చెబితే పోలీసులు అదే చేస్తారా.
మీకు బాస్ డీజీపీనా, సీపీనా, ఎమ్మెల్యేనా.
దౌర్జన్యాలపై నియోజకవర్గం వ్యాప్తంగా బంద్ చేస్తాం. హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్న పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో బంద్ కు పిలుపునిస్తాం .
కర్రె వెంకటయ్య కు భవిష్యత్తులో ఏమీ జరిగిన విప్ ఐలయ్య, పోలీసులే బాధ్యత వహించాలి.
కర్రె వెంకటయ్య పై ఎమ్మెల్యే కు ఎందుకు కక్ష్య.
నిజ స్వరూపం ఏమిటి ఐలయ్య, నీకు ఎందుకింత అహంకారం.
ఇక పై మేము ఊరుకునేది లేదు.
రజకార్లను తలిపించేలా పోలీసులు వ్యవహారించారు.
కర్రె వెంకటయ్య ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు.
నియోజకవర్గ వ్యాప్తంగా పిలుపునిస్తే తట్టుకోలేరు.
ఏసీపీ శ్రీనివాస్ నాయుడు చాలా మంచి అధికారి, ఆయన పై నమ్మకం ఉంది.
ఆలేరు ప్రజలంతా చూస్తున్నారు, అన్ని గమణిస్తున్నారు.
గంధమల్ల రవి కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇద్దరు ఆడ పిల్లలపై నగదు డిపాజిట్ చేయాలి.
కర్రె వెంకటయ్య పై బీర్ల ఐలయ్య కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.
కురుమ సామాజిక వర్గానికి చెందిన కర్రె వెంకటయ్య రాజకీయంగా ఎదగకుండా బీర్ల ఐలయ్య ఇలాంటి చర్యలు చేస్తున్నారు.
పోలీసులకు బాస్ బీర్ల ఐలయ్య.
సీఎం రేవంత్ రెడ్డి మాధిరిగానే బీర్ల ఐలయ్య నిన్న జరిగిన ఆత్మహత్యను పక్క దారి పట్టించడానికే కర్రె వెంకటయ్య పై పన్నిన కుట్ర..