నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 17 – 06 – 2025,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
జ్యేష్ఠ మాసం,
బహుళ పక్షం,

తిథి. : *షష్ఠి* మ12.14 వరకు,
నక్షత్రం : *శతభిషం* రా10.56 వరకు,
యోగం : *విష్కంభం* ఉ8.25 వరకు,
కరణం : *వణిజ* మ12.14 వరకు
తదుపరి *భద్ర* రా11.26 వరకు,

వర్జ్యం : *ఉ6.34 – 8.07*
మరల *తె5.04 నుండి*
దుర్ముహూర్తము : *ఉ8.05 – 8.57,*
మరల *రా10.54 – 11.38*
అమృతకాలం : *మ3.55 – 5.28,*
రాహుకాలం : *మ3.00 – 4.30,*
యమగండం : *ఉ9.00 – 10.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.29,
సూర్యాస్తమయం: 6.32,

*_నేటి మాట_*

*భగవద్ – అవతరణ*
నేడు చాలా మంది జనాలు, ఏమి అవతారం, ఆయన దేవుడే అయితే నాకు ఇది చేయమని, అలా చేసి చూపమను, అని పనికి రాని మాటలతో హేళన చేస్తుంటారు,
మనకు తెలుసు ఒక – విమానం ఫలానా చోట దిగుతుంది అని, మరి ఎందుకు అక్కడ దిగుతుంది?
“అంతకుముందే అక్కడ టికెట్టుకొని సీటు రిజర్వు చేయించుకున్న వారిని ఎక్కించుకొని పోయేందుకు దిగుతుంది.”

అలానే !! భగవంతుడు కూడా అవతరించాడు, ఎందుకు?
అర్హులైన వారికి ముక్తినిచ్చి రక్షించేందుకు.
మిగిలినవారు కూడా ఆయనను గురించి తెలుసుకుంటారు.
అయన కృపను పొందే మార్గాలను అనుసరిస్తారు, ముక్తి సంపాదించుకుంటారు.

అయితే … కొంతమందికి విమానాన్ని ఎక్కే అవకాశము లభించదు.
వాళ్ళు కోపంగా విమానాన్ని తిక్కుకుంటారు.
కానీ విమానానికి కోపం వస్తుందా, రాదు అలాగే తాము కోరింది జరగలేదని కొందరు అవతారమూర్తిని విమర్శిస్తారు.
“దూషిస్తారు అయనకవేమి పట్టవు.”
కేవలం ఆయన ఎవరికోసం వచ్చాడో వారిని ఉద్ధరింప చేయడం ఆయన కర్తవ్యం.

*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏