ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుంది..రాజవంశీయుడు రెజా పహ్లవి..

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు…ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దిశకు చేరుకుందని.. త్వరలో కూలిపోతుందని తెలిపారు. భవిష్యత్ బాగుండాలంటే ఇరానీయులు తిరగబడాలని కోరారు. ఇది తిరగబడే సమయమని.. ఇరాన్‌ క్షేమంగా ఉండాలంటే ఇదే మంచి సమయమని.. త్వరలో మీతో ఉంటానని రెజా పహ్లవి పేర్కొన్నారు..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇరానీయులను ఉద్దేశించి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవి వంశస్థుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో ఖమేనీ రహస్య బంకర్‌లో దాక్కున్నాడని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడని తెలిపారు. దేశం పతనానికి కారణం ఖమేనీనే అని పేర్కొన్నారు. సంవత్సరాలుగా మాతృభూమిని యుద్ధంలో ఆహుతి కాకుండా నిరోధించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. ఖమేనీ ప్రభుత్వం కూలిపోతేనే.. ఇరానీయులు క్షేమంగా ఉంటారని కోరారు. ఇరాన్‌ను తిరిగి పొందే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బందర్ అబ్బాస్ నుంచి బందర్ అంజాలి వరకు, షిరాజ్ నుంచి ఇష్ఫహాన్ వరకు, తబ్రిజ్ నుంచి జహేదాన్ వరకు, మష్హాద్ నుంచి అహ్వాజ్ వరకు మరియు షహర్-ఎ-కోర్డ్ నుంచి కెర్మాన్షా వరకు.. ఇప్పుడు ఖమేనీ పాలనను అంతం చేద్దాం అంటూ వెల్లడించారు. ఇరాన్ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని.. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన కోసం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ భవిష్యత్ కోసం.. అభివృద్ధి కోసం ఇదే మంచి తరుణం అని చెప్పారు..

https://x.com/PahlaviReza/status/1935037345461653974?t=C3yV8KfU5M2gQ8CcFpCXXA&s=19