పెన్షన్ గిఫ్ట్.. మూడు రెట్లు పెంచిన సీఎం నితీష్ కుమార్..!

రూ.700 పెన్షన్‌ పెంపు.. సీఎం ప్రకటన! వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు వర్తింపు

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ రకాల సామాజిక పింఛన్లను మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు…పెంచిన పింఛన్ జూలై నుంచి అందుతుందని చెప్పారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 400 అందుతోంది. మూడు రెట్లు పెంచడంతో వచ్చే నెల నుంచి వారికి రూ.1100 అందనుంది. పెంచిన పెన్షన్ ప్రతి నెల 10వ తేదీ లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు JD(U) అధినేత నితీష్..వృద్ధులు సమాజంలో ఒక భాగం. వారి గౌరవంగా జీవించేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.” అని నితీష్ పేర్కొన్నారు. బీహార్‌లో ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే..