లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసిన…చాకలి ఐలమ్మ మునిమనవరాలు..!

ఇన్‌స్టా లవర్ కోసం తల్లిని చంపిన.. 10th క్లాస్ కూతురు..

ఇన్‌స్టా లవర్ కోసం తల్లిని చంపిన.. 10th క్లాస్ కూతురు..

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయిని మరియు ఫోక్ సింగర్ అయిన అంజలి, తన సొంత కుమార్తె చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది… చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయిని, ఫోక్ సింగర్ అంజలి సొంత కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైంది. హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న అంజలి..కూతురు మరో యువకుడితో మాట్లాడుతుందని మందలించింది. పదో తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ లవర్ కోసం తల్లిని దారుణంగా చంపింది. దానికి ఆమె తమ్ముడు కూడా సహకరించాడు. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి, తలపై కొట్టి చాంపారు.

తేజ శ్రీ స్థానికంగా పదో తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం శివ అనే యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అతని కోసం తల్లిని కూడా చంపడానికి వెనుకాడలేదు శ్రీతేజ. తమ్ముడు యశ్వంత్, లవర్ శివలతో కలిసి తల్లిని కిరాతకంగా హత్య చేసింది. ముగ్గురు కలిసి అంజలి తలపై కొట్టి, గొంతు నులిమి చంపారు. తేజశ్రీ–పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు..