*శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు*
Jun 26, 2025,
శ్రీశైలం వెళ్తున్న మినీ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
తెలంగాణ : నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ ప్రైవేటు మినీ బస్సు బ్రేక్ ఫెయిలై దోమలపెంట బస్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సులో సుమారు 30 మంది ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు…
కరీంనగర్: మానకొండూర్‌లో ఉద్రిక్తత
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.
అనర్హులకు ఇళ్లు ఇచ్చారని ఆందోళనకు సిద్ధమైన BRS..లబ్ధిదారులను తరలించిన కాంగ్రెస్ నాయకులు..మానకొండూర్‌లో భారీగా పోలీసుల మోహరింపు..
కట్నం వేధింపులు.. ఒకేరోజు ఇద్దరు స్నేహితురాళ్ల మృతి.
తెలంగాణ : అదనపు కట్నం వేధింపులు ఇద్దరు వివాహితల ప్రాణాలు తీసింది. కరీంనగర్(D) తిమ్మాపూర్(M) ఇందిరా నగర్‌కు చెందిన రొడ్డ మమత (24), పెద్దపల్లి(D) ఎన్టీపీసీ ప్రగతి నగర్‌కు చెందిన అనూష(27) స్నేహితులు కాగా ఇందిరానగర్‌లోని ఓ డెయిరీలో పని చేస్తున్నారు. మమతకు రాజమల్లుతో, అనూషకు రమేశ్‌తో వివాహం అయింది. వీరి భర్తలలు వివాహేతర సంబంధం పెట్టుకోవడం, అదనపు కట్నం కోసం వేధించడంతో ఒకే రోజు ఈ నెల 23న వేర్వేరు చోట్ల పురుగు మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం ఇద్దరూ మృతి చెందారు..
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షం.. షాకింగ్
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని సైన్జ్ లోయలో భారీ వరదలు సంభవించాయి. దీని కారణంగా పరిసర ప్రాంతాలలో ముందస్తు హెచ్చరిక జారీ చేయబడింది. పార్వతి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించనప్పటికీ, ముందుజాగ్రత్తగా ప్రజలు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచించారు. ఈ వరదలకు సంబంధించి షాకింగ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి….
లోయలో పడ్డ బస్సు.. 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్సు అలకనంద నదిలో పడి ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. రుద్రప్రయాగ్ జిల్లా ఘోత్తీర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు కొందరిని రక్షించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
IASలు వారానికి రెండు పాఠశాలలు సందర్శించాలి: రేవంత్.
TG: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లోని IAS అధికారులు వారానికి 2 పాఠశాలలను సందర్శించాలని విద్యాశాఖ సమీక్షలో సూచించారు. ఈ ఏడాది పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారీకి సోలార్ కిచెన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. టెన్త్ పాసైన విద్యార్థులు కచ్చితంగా ఇంటర్లో చేరేలా చూడాలని తెలిపారు…
*Jio, అదానీ గ్రూప్‌ల మధ్య కీలక ఒప్పందం..!!
అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL), రిలయన్స్ JIO BP కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ATGL స్టేషన్లలో JIO BP పెట్రోల్, డీజిల్ అందించనుండగా, జియో స్టేషన్లలో ATGL CNG యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయకుండా, ఇప్పటికే ఉన్న వాటిని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాపార నిపుణులు ఈ నిర్ణయాన్ని స్మార్ట్ స్టెప్‌గా అభివర్ణిస్తున్నారు..!
ప్రశాంత్ కిశోర్ పార్టీకి ఎన్నికల గుర్తుగా ‘స్కూల్ బ్యాగ్’
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. ‘స్కూల్ బ్యాగ్’ గుర్తుపై బిహార్‌లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. గత ఏడాది అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ ఈ పార్టీని స్థాపించగా, 8 నెలల తర్వాత ఈసీ గుర్తును కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం బిహార్ ఎలక్షన్స్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సి ఉంది..
తప్పుడు కేసులో ఇరికించారు: జగన్
వైకాపా కార్యకర్త సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని,కేసును కొట్టివేయాలని కోరారు.
తనతో పాటు ఇతర వైసీపీ నాయకుల పిటిషన్లపై..
హైకోర్టు నేడు (జూన్ 26) విచారణ చేపట్టనుంది.
ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని జగన్ తరపు న్యాయవాదులు వాదించారు..
*ఇల్లందు సిఐ సస్పెండ్*
ఉత్తర్వులను జారీ చేసిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భార్య భర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందులకు గాను మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ ఇల్లందు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసారు.
పోలీసు అధికారులు గానీ,సిబ్బంది గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖా పరమైన విచారణ జరిపి క్రమశిక్షణా చర్యలు తప్పవని ఈ సందర్బంగా తెలియజేసారు.మరింత సమాచారం తెలియల్సి ఉంది..!.
రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై కారుతో యువతి హల్చల్ ….
తెలంగాణ : హైదరాబాద్ నగర శివారు కొండకల్లో ఓ యువతి కారుతో రైల్వే ట్రాక్‌పై హల్చల్ చేసింది… తీరా ఆమెని ఎంక్వయిరీ చేయగా రీల్స్ కోసమే ఇలా చేసిందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది… రైల్వే ట్రాక్‌పై కారు నడిపింది. కొండకల్ నుంచి శంకర్పల్లి వరకు పట్టాలపై కారు డ్రైవింగ్ చేసింది. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. కారు ఆపాలని చెప్పినా ఆమె వినకుండా డ్రైవింగ్ చేసింది. చివరికి కష్టపడి కారు ఆపారు. అయితే గంజాయి మత్తులో యువతి అలా చేసినట్లు అనుమానిస్తున్నారు…..
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85/85 గేట్లు తెరిచిన అధికారులు
గోదావరి నదిలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో, 85 గేట్లు తెరిచిన అధికారులు
ఇన్ ఫ్లో 5400 క్యూసెక్కులు ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా పూర్తిగా 5400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..
ఎయిరిండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు..
ముంబై నుండి బ్యాంకాక్ వెళ్లే ఎయిరిండియా విమానం రెక్కల మధ్యలో పక్షి గూడు పెట్టింది. ఇది గమనించిన ఓ ప్రయాణికుడు ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కు చూపించాడు. ఎయిర్ హోస్టెస్ పైలట్‌కి చూపించడంతో.. వెంటనే గ్రౌండ్ స్టాఫ్‌కు కాల్ చేయగా.. పక్షి గూడుకు చెందిన చిన్న కర్రలను సిబ్బంది తొలగించారు. దీంతో విమానం 3 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. కాగా వరుస విమాన ప్రమాద ఘటనలు కలవరపెడుతోన్న విషయం తెలిసిందే. ..
*ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్*
ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసిన ప్రభుత్వం
రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తద్వారా 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.
ఇకపై.. బైకులకు టోల్ గేట్ ఫీజు..
భారతదేశంలో.. జూలై 15, 2025 నుండి, జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు ముగియబోతోందని NHAI మరియు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇకపై.. హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ చెల్లించడానికి సిద్ధంగా ఉండండి..