తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిగ్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడేలా… కెసిఆర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం అందుతుంది..
బనకచర్ల ఎపిసోడ్ ను వాడుకొని రేవంత్ రెడ్డి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ వేశారట.
KCR’s big sketch Now only dots for Revanth and Chandrababu
ఈ మేరకు తన ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారట కల్వకుంట్ల చంద్రశేఖర రావు. బనకచర్ల ఎపిసోడ్ పై ఎలా ముందుకు వెళ్లాలి..? తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా ఎలా వ్యవహరించాలి? ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే బనకచర్ల ఆగిపోతుంది అనే దాని పైన కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…దీనిపైన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఓ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ బహిరంగ సభలో బనకచర్ల, కాలేశ్వరం అవసరం ఇలాంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగించబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఆటలు సాగకుండా చేయవచ్చని కేసీఆర్ స్కెచ్ లు వేస్తున్నారట. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి బరిలోకి దిగబోతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. ఇదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మొత్తం మారిపోతాయని అంటున్నారు…
బిఆర్ఎస్ స్పీడు , ఇక ప్రతి విషయంపై దూకుడే..!?
కేటీఆర్ పై వస్తున్న వరుస కథనాలకి షాక్ ఇచ్చేలా మహా టీవీ పై దాడి.. ఇక చేతులు ముడిచి కూర్చుంటే ప్రతి ఒక్కడు కూడా ఇలానే ఊహ జనిత వార్తలను ప్రజల్లోకి పంపించే అవకాశం ఉందని గమనించిన బిఆర్ఎస్ పార్టీ ఇక మన జోలికి రావాలంటే ఉద్యమ సమయంలో ఎలాగైతే స్పందించారు అదే స్థాయిలో స్పందించాలని టిఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లుగా సమాచారం..