సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 5 మంది చనిపోయినట్లు సమాచారం


పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు..
ప్రమాద ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ కార్మికులు
పరిశ్రమలో భారీగా ఎగసిపడుతున్న మంటలు
మంటల్లో చిక్కుకున్న కార్మికులు
ఘటన స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది….
పాశమైలారంలోని సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి.. 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ఐదుగురు మృతి..
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామి భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో పదిమంది మృతిచెందారు. ఘటనాస్థలంలో ఐదుగురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.
పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశ్రమ నుంచి ఘాటైన వాసనలు వెలువడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.