*ఆంధ్ర ప్రదేశ్ :*
*ఏపీలో విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఏసీడీ ఛార్జీలు రద్దు*
ఏపీలో కరెంట్ వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్ శుభవార్త చెప్పింది.
తక్కువ కరెంట్ వాడేవారికి, పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) ఛార్జీలు రద్దు చేసింది.
తక్కువగా కరెంట్ ఉపయోగించేవారి నుంచి, పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్నవారి నుంచి గతంలో ఏసీడీ ఛార్జీలు వసూలు చేశారు.
దీనిపై విద్యుత్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది….