42 కు చేరిన పటాన్ చేరు ప్రమాద మృతుల సంఖ్య.. మరింత పెరిగే అవకాశం.గల్లంతు అయినా వారంతా కూలిన భవనం శిధిలాల కిందే ఉండే అవకాశం.
*🔹పాశా మైలారం ఘటనలో 42 కు చేరను మృతుల సంఖ్య..*
_• మృతుల సంఖ్య 55 పెరిగే అవకాశం.._
_• అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిధిలాలు తొలగిస్తున్న అధికారులు.._
శిథిలాల కింద మరో 20 మంది..
రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్ డి ఆర్ ఎఫ్ ,ఎస్ డి ఆర్ ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది..
మరో రెండు మృతదేహాలు గుర్తింపు..
ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు..
గుర్తుపట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు..
మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు..
చనిపోయిన వారిలో ఎక్కువగా తమిళనాడు, బీహార్, జార్ఖండ్ కు చెందిన వారే..
చికిత్స పొందుతున్న 33 మంది క్షతగాత్రులు…
పటానుచెరు పారిశ్రామిక వాడలోరియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్యగా క్రమంగా పెరుగుతోంది. షిప్ట్ లో 150 మందికి పైగా పని చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బ్లాక్ లో 90 మంది ఉన్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 42 కి చేరుకుంది. సుమారు 40 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
పారిశ్రామిక వాడ పాశ మైలారంలో సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి కంపెనీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్, మానుఫ్యాక్చర్ యూనిట్లలోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి.
పేలుడు సంభవించినప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీలో ఎక్కడ పడితే అక్కడ క్షత గాత్రులు పడిపోయారు. ప్రాణాపాయ స్థితిలోఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సంగారెడ్డి కలెక్టర్ , ఎస్ పి ప్రమాద స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు..
సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ : ఘటనను తీవ్రంగా పరిగణించిన సర్కార్, సీనియర్ ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అగ్నిప్రమాదం జరిగిన పరిశ్రమను పరిశీలించనున్నారు.
సోమవారం (జూన్ 30) పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. సిగాచీ కెమికల్ ఇండస్ట్రీలో స్ప్రేయర్ డ్రయ్యర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడున్న పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలిలోనే ఏకంగా 41 మంది మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు..
వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ మృతి : పేలుడు జరిగినప్పుడు ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమవ్వడం మరింత బాధాకరం. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్ బీమ్‌లు సైతం విరిగి, కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు…