పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకొచ్చి టీ న్యూస్ చానల్ లోపల విడియోలు తీయిస్తున్నారు..టీన్యూస్ సీఈవో శైలేష్ రెడ్డి…!

పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను వెంట తీసుకొచ్చి టీ న్యూస్ చానల్ లోపల విడియోలు తీయించారు

ఇంత దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థను మేము ఎప్పుడు చూడలేదు

మాపై బురద చల్లాలి అనుకునే వాళ్లకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు

టీన్యూస్ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు

యాంకర్ స్వేచ్ఛ మృతిపై విచారణ నేపథ్యంలో టీ న్యూస్ సీఈవోతో జరిపిన సంభాషణ వీడియో తీసి మీడియాకు పంపిన పోలీసులు

ఎవరో ప్రైవేట్ వ్యక్తులను తీసుకు వచ్చి పోలీసులు వీడియోలు తీశారు.. వీడియో ఎలా బయటకు వెళ్ళిందని అడిగితే పోలీసులు దాటవేస్తున్నారు

గాంధీ భవన్ నుండి, ముఖ్యమంత్రి నుండి వచ్చే ఆదేశాలతో పోలీసులు పని చేస్తున్నారు

విచారణ పేరుతో రికార్డ్ చేసిన వీడియోలను బయటకు పంపించి పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దీనిపై చట్టపరంగా ముందుకెళ్తాం – టీన్యూస్ సీఈవో శైలేష్ రెడ్డి..