కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నవారిపై ఇంకాస్త స్ట్రాంగ్‌గా లీగల్ ఫైట్‌…

రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమే. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం కూడా పాలిటిక్స్‌లో కామనే. కానీ వ్యక్తిగత విమర్శలకు వచ్చేసరికి లీడర్లు కూడా హర్ట్ అవుతున్న పరిస్థితి. వ్యక్తిగత విమర్శలు, హద్దులు దాటి తిట్ట పురాణం కొన్ని రోజులుగా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో తనపై అడ్డగోలుగా.. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నవారిపై ఇకపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటానని చెప్పకనే చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నవారిపై ఇంకాస్త స్ట్రాంగ్‌గా లీగల్ ఫైట్‌ చేయాలని డిసైడ్ అయ్యారట. ముందు నుంచి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో కేటీఆర్ సీరియస్‌గానే ఉంటూ వస్తున్నారు. మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం దావాపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ కేసులో కొండా సురేఖ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు..
ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్‌ కేకే మహేందర్ రెడ్డికి గతంలో లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్‌లో ఏ ప్రమేయం లేకున్నా ఈ నేతలంతా తనను బద్నాం చేసేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్.. తనపై ఆధారాల్లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని లీగల్ నోటీసుల్లో పంపారు.