కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు.. హరీష్ రావు..
కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపంతో రేవంత్ రెడ్డి రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు
మేడిగడ్డ దగ్గర ఈ నిమిషంలో 73,600 క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి.. గోదావరి నది 96 మీటర్ల లెవెల్లో ప్రవహిస్తుంది
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది.. మోటార్లు ఆన్ చేస్తే చాలు, రైతులకు నీళ్లు ఇవ్వొచ్చు
కానీ నీళ్లు ఎత్తి పోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ – హరీష్ రావు….
గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లిందని తెలిపారు..
కేసీఆర్ తీసుకొచ్చిన పథకాల వల్ల రైతు ఆత్మహత్యలు కనివినీ ఎరుగని స్థాయిలో తగ్గాయని హరీశ్రావు అన్నారు. కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాయని చెప్పారు.