ఎప్సెట్ వెబ్‌ ఆప్షన్ల నమోదు మరోసారి ఆలస్యం.!

రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. కానీ తెలంగాణ ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి ఆలస్యం అవుతోంది. షెడ్యూల్‌ ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 4 గంటలకు మార్పు చేశారు. తాజాగా మరోసారి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియను మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటల నుంచి నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నాయి. వెబ్‌ ఆప్షన్లకు ఈ నెల 6 నుంచి 10 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో తొలి విడత మాక్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 18లోపు మొదటి విడత సీట్లు కేటాయిస్తారు.
TELANGANA EAPCET WEB OPTIONS.
రెండో విడత : ఈ నెల 25న రెండో ఫేజ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం కల్పించి 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 26,27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30వ తేదీలోపు సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు చేయనున్నారు. రెండో విడత కౌన్సిలింగ్ తరువాత స్టూడెంట్స్ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీల్లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అన్ని కాలేజీల నుంచి స్టూడెంట్స్ జాయినింగ్ సమాచారం తీసుకుని మిగతా సీట్లకు వచ్చే నెల 5 నుంచి స్లాట్ బుక్కింగ్ చేపట్టనున్నట్టు టీజీఈఏపీసెట్ అడ్మిషన్స్ కమిటీ ప్రకటించింది.

మూడో విడత : వచ్చే నెల 5న మూడో విడత కౌన్సిలింగ్ స్లాట్ బుక్కింగ్ కి అవకాశం ఇచ్చి 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6,7 తేదీల్లో వెబ్ ఆప్షన్లు స్వీకరిస్తారు. వచ్చే నెల 10వ తేదీలోపు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 3 విడతల కౌన్సిలింగ్ పూర్తైన తరువాత ఇంటర్నల్ స్లైడింగ్కి అవకాశం కల్పించనున్నట్టు అడ్మిషన్స్ కమిటీ పేర్కొంది. ఇంటర్నల్ స్లైడింగ్కి ఆగస్టు 18,19 తేదీల్లో ఆప్షన్లను తీసుకుని ఆగస్టు 22వ తేదీలోపు సీట్లకేటాయింపును పూర్తి చేయనుంది..