భారత్-పాక్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్‌పై చైనా దుష్ప్రచారం!..

, పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత రాఫెల్ యుద్ధవిమానాలపై దుష్ప్రచారం చేయడానికి ఎంబసీలను చైనా ఉపయోగించుకుంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ మిలిటరీ అండ్ ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి… చైనా.. భారత్ పై విషం చిమ్మడంపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్థాన్ పై భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కూడా ప్రయోగించింది. అయితే చైనా ఈ యుద్ధ విమానాలు ధ్వంసం అయినట్లు తప్పుడు సమాచారాన్ని ప్రపంచ దేశాలకు చేరవేసింది.
China, Pakistan behind anti-Rafale jets
పాకిస్థాన్- భారత్ మధ్య ఉద్రిక్తతల సమయంలో చైనా మనదేశంపై పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఫ్రెంచ్ రిపోర్టు ప్రకారం భారత్ ఆయుధాల ఎగుమతులను తగ్గించేందుకు చైనా బిగ్ స్కెచ్ వేసినట్లు తేలింది. చైనా తన ఎంబసీల ద్వారా ప్రపంచ దేశాలకు ఓ భారీ అబద్ధాన్ని చేరవేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ పై భారత్ ప్రయోగించిన అనేక ఆయుధాలు, క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని వాటిని ఏ దేశం కూడా కొనుగోలు చేయొద్దని ఫేక్ ప్రచారం చేసింది డ్రాగన్.

ఈ విధంగా చేయడంతో భారత్ ఆయుధాలు, ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్ ఆయుధాలను ప్రపంచ దేశాలు కొనుగోలు చేయడం ఆపేస్తాయని.. తద్వారా తమ దేశ ఆయుధాలను ఎగుమతి చేసుకోవచ్చని చైనా కుట్రలు పన్నినట్లు ఫ్రెంచ్ రిపోర్టు తెలిపింది. అంతేకాక పాకిస్థాన్ తోనూ ఈ ఫేక్ వార్తలను ప్రచారం చేయించింది డ్రాగన్. ఈ క్రమంలో పాకిస్థాన్- భారత్ ఉద్రిక్తతల అనంతరం.. భారత్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను తాము కూల్చేసినట్లు పాకిస్థాన్ విష ప్రచారం చేసింది.

అయితే తాజాగా ఈ నివేదికలోని విషయాలను డ్రాగన్ కొట్టిపారేసింది. తాము అలా ఫేక్ ప్రచారం చేయలేదని చెప్పుకొచ్చింది. కానీ చైనా కచ్చితంగా ఇలాంటి పనులు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫ్రాన్స్ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కొనుగోలు చేశాయి. ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఇప్పటివరకు 533 యుద్ధ విమానాలకు ఎగుమతి చేసింది. వీటిల్లో 323 యుద్ధ విమానాలను ఈజిప్టు, భారత్, ఖతార్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా ఉన్నాయి. మరో 42 రఫేల్ యుద్ధ విమానాలను ఇండోనేషియా ఆర్డర్ చేసింది….ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా లైవ్ లో ఇంటెలిజెన్స్ రిపోర్టు అందించిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్. సింగ్ ఇటీవల పేర్కొన్నారు. భారత ఆయుధ సంపత్తి విషయాలు మొత్తం పాక్ కు చైనా చేరవేసిందని.. పాకిస్థాన్ లో ఏఏ ప్రాంతాల్లో భారత్ దాడులు చేపట్టనుంది అనే కీలక విషయాలు చైనా ఇంటెలిజెన్స్ పాక్ కు ఇచ్చిందని అన్నారు…