కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్..

.

మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం.. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటాం

రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా సభలో వినిపిద్దాం

మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని ఎప్పడు స్పీకర్ కు లేఖ రాసినా మేం సిద్ధం

మీ హయాంలో, మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం

సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా …ఎలాంటి గందరగోళం లేకుండా.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది

కెసిఆర్ గారు మీరు రండి.. ఎక్స్పర్ట్స్ ను పిలుద్దాం.. స్టేక్ హోల్డర్స్ ను పిలుద్దాం.. అర్ధవంతమైన చర్చ పెడదాం..

మీ ఆరోగ్యం సహకరించకపోతే.. తారీఖు చెప్పండి.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు నేను మంత్రుల బృందాన్ని పంపుతా.. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం…

కాదు కూడదు నేనుకూడా రావాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి రావడానికి నేనుకూడా సిద్ధం..

వాస్తవాలను ప్రజలకు అందించడమే మా ఉద్దేశం…

తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం

తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతాం.