గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు విడుదల..!

*🔹గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు విడుదల*

▪️మల్టీపర్పస్ వర్కర్లకు 3నెలల జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం.
▪️ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి రూ.150 కోట్లు విడుదల చేసిన ఆర్థికశాఖ.
▪️ఇవాళ గ్రామపంచాయతీల ఖాతాల్లో జమకానున్న జీతాలు.ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన పెండింగ్ జీతాలను మంగళశారం (జులై 08) ఆర్థికశాఖ విడుదల చేసింది. రూ.150 కోట్ల నిధులను వేతనాల కోసం మంజూరు చేసింది.

బుధవారం (జులై 09) గ్రామపంచాయతీల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53 వేల మంది వర్కర్ల కు జీతాలు అందనున్నాయి. జీతాలు మంజూరు చేయడంపై మల్టీ పర్పస్​ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు కూడా అందిస్తామని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన తెలిపారు.