భారత్ కు నష్టం కలిగిందనే ఒక్క చిత్రమైన ఆధారంగా చూపించగలరా? భారత్లో ఒక గాజు కూడా పగలేదు..అజిత్ డోభాల్.
భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కచ్చితంగా ధ్వంసం చేసిందని, వాటిలో ఏదీ మిస్ కాలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్ పట్ల తనకు గర్వంగా ఉందని ఐఐటి మద్రాస్ 62వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. భారత్ కు నష్టం కలిగినట్లు ఒక చిత్రాని చూపించగలరా? అని అజిత్ డోభాల్ సవాల్ విసిరారు..ఆపరేషన్ సిందూర్ గురించి నిజంగా గర్వపడుతున్నా. స్వదేశీ సామర్థ్యంతోనే పాకిస్థాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. ఎవరు, ఎక్కడ ఉన్నారో భారత్కు కచ్చితంగా తెలుసుకునే స్థాయి ఉంది. మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లోనే ముగిసింది. మే 7న తెల్లవారుజామున ఒంటి గంట తర్వాత ఇదంతా జరిగింది. ఆ తర్వాత, పాకిస్థాన్ అది చేసింది, ఇది చేసిందని విదేశీ మీడియాలో అసత్య కథనాలు వచ్చాయి. అయితే, భారత్ కు నష్టం కలిగిందనే ఒక్క చిత్రమైన ఆధారంగా చూపించగలరా? భారత్లో ఒక గాజు కూడా పగిలిపోయిందనేది లేదు. పాకిస్థాన్లోని 13 వైమానిక స్థావరాలు ధ్వంసమైన ఫొటోలు మాత్రమే బయటకు వచ్చాయి’ అని అజిత్ డోభాల్ అన్నారు..