భార్యతో విడాకులు.. భర్త సంబరాలు.!అస్సాంకు చెందిన మాణిక్ అలీ భార్యతో విడాకులు మంజూరయ్యా యనే సంతోషంతో పండుగ చేసుకున్నాడు. 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ‘ఆమె తన ప్రియుడితో రెండు సార్లు పారిపోయి మళ్లీ వచ్చింది. నా కూతురి కోసం ఆమెను క్షమించా. కలిసి ఉండటానికి ప్రయత్నించా. కానీ పదే పదే అదే తప్పు చేస్తుంటే భరించలేకపోయా’ అని చెప్పాడు. విడాకుల తర్వాత కొత్త జన్మ పొందినట్లు ఉందని, కొత్త జీవితానికి గుర్తుగా పాలతో స్నానం చేశానని వివరించాడు….
https://x.com/r9telugunews/status/1944305482174542227?t=214IkzlzwjxriNUV0cjMFw&s=19
అస్సాంలోని నల్బరీ జిల్లా ముకల్మువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ అరుదైన సంఘటన ఇప్పుడు వైరల్గా మారింది. బరలియాపర్ గ్రామానికి చెందిన మాణిక్ అలీ అనే వ్యక్తి తన భార్యతో చట్టబద్ధంగా విడాకులు పొందిన వెంటనే ఆనందోత్సవంలో భాగంగా 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు.ఈ సంఘటన భౌతికంగా చిన్నదైనా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం పెద్ద చర్చకు దారి తీసింది. చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యేలా ఈ వ్యక్తి తన జీవితంలోని ఒక కీలక మలుపుని సెలబ్రేట్ (Celebrate) చేసుకున్న విధానం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగానే మాట్లాడుతూ, నేను కొత్తగా జన్మించినట్లు అనిపిస్తోందని చెప్పాడు. దాంపత్య జీవితం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా జీవిని అయ్యానంటూ తెలిపాడు.
తీవ్ర మనస్తాపానికి
అలాగే కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈ పాల స్నానాన్ని ఒక ప్రతీకగా ఎంచుకున్నట్లు వివరించాడు.అంతేకాకుండా తన భార్య గురించి కూడా చాలానే విషయాలను చెప్పాడు. తమకు పెళ్లై ఓ కుమారుడు కూడా పుట్టాక, భార్య ఇప్పటికే రెండు సార్లు ప్రియుడితో పారిపోయిందని గుర్తు చేశాడు. ఈ పరిస్థితి తనను, తన కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని వెల్లడించాడు. కానీ కుమారుడి భవిష్యత్ (Son future) దృష్టిలో పెట్టుకుని, నచ్చకపోయినా భార్యతో ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందాడు.రానంటున్నా పిల్లాడి కోసం ఆమెను ఇంటికి తీసుకువచ్చి పెట్టుకున్నానని, కానీ ఈ ప్రయత్నాలన్నీ విఫలం అయి చివరకు విడాకులు ఇచ్చినట్లు చెప్పాడు..
మంచి పని చేశావు బ్రో
ఇకపై సంతోషంగా బతుకుతానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ మాణిక్ అలీ నిర్ణయాన్ని సమర్థిస్తూ, మంచి పని చేశావు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వాళ్లతో కలిసుండడం కంటే నీవు ఒక్కడివే కుమారుడిని పెంచుకోవడం మంచిదంటూ వివరిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో పాల (Milk) ను వృథా చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఘటన అస్సాంలో చర్చనీయాంశంగా మారింది.