బీఎస్ఈకి బాంబు బెదిరింపులు…

బీఎస్ఈకి బాంబు బెదిరింపులు

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎక్స్ఛేంజ్ టవర్ భవనంలో 4 RDX IED బాంబులను అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు అవి పేలిపోతాయని దుండగులు ఇ మెయిల్ చేశారు. BSE సిబ్బంది ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ బాంబు బెదిరింపులు గుర్తించారు. అయితే, బాంబు బెదిరింపుల మెయిల్ కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు…

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959

సమగ్ర తనిఖీలు చేసిన అధికారులు
ఈ బెదిరింపు సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు, బాంబ్ నిర్వీర్య బృందం వెంటనే బీఎస్ఈ భవనానికి చేరుకుని సమగ్ర తనిఖీలు చేపట్టాయి. దక్షిణ ముంబైలోని దళాల్ స్ట్రీట్‌లో ఉన్న ఈ ఐకానిక్ భవనంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. అయితే, తనిఖీల తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదని అధికారులు ధృవీకరించారు. ఈ బెదిరింపు ఒక హోక్స్‌గా (నకిలీ బెదిరింపు) గుర్తించబడింది..