మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతోంది..ఒక్కొక్క హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ కి దారాదత్తం చేస్తోంది.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..
మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్..
తెలంగాణ భవన్ .హైదరాబాద్…
తెలంగాణ వాదులు భయపడుతున్నది నిజం అవుతోంది
..ఒక్కొక్క హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ కి దారాదత్తం చేస్తోంది
..కేసీఆర్ ఏ నీళ్ల కోసమైతే పోరాడారో ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీ కి కట్టబెడుతున్నారు
…మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతోంది
…ముందు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క ఫోన్ కాల్ తో హుటాహుటిన వెళ్ళాడు
…సీఎం హోటల్లో ఉండి రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు
..ఓ పత్రిక ఢిల్లీ మీటింగ్ కు సంబంధించి తెలంగాణ లో ఓ హెడ్ లైన్ ఏపీ లో మరో హెడ్ లైన్ పెట్టింది
..జలవివాదాల పై కమిటీ అని తెలంగాణ లో గోదావరి బనకచర్ల పై కమిటీ అని ఏపీ ఎడిషన్ లో పెట్టారు
..ఇదొక్కటి చాలు తెలంగాణ కు చేస్తున్న ద్రోహమేమిటో తెలుసుకోవడానికి
…రేవంత్ తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో ,చంద్రబాబు ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడా ఈ వార్త పై చర్చ తో తేలిపోవాలి
..కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు లపై బూతులు కాదు ..కాంగ్రెస్ నేతలు ఈ అంశం పై మాట్లాడాలి
..తెలంగాణ సోయి ,తెలంగాణ ఆత్మ లేని వాళ్ళ పాలన నడుస్తోంది అని మేము మొదట్నుంచి చెబుతున్నది నిజమైంది
..సీఎం ఎవరికి భయ పడుతున్నాడు ,ఎందుకు భయపడుతున్నాడో ?ఒక్క ఫోన్ కాల్ కు భయపడుతాడా ?
..తెలంగాణ ప్రజలు రేవంత్ కు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు చేసుకోవడానికా ?
…బనకచర్ల పై ఇంత పచ్చి అబద్దం మాట్లాడిన రేవంత్ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు
…అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డిమాండ్ చేయకుండా నిన్నటి మీటింగ్ కు సీఎం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ?
…నీ ఒక్కడి పదవి కోసం కోట్లాది ప్రజల హక్కులను బలి పెడతావా ?
…ఎందుకు భయపడుతున్నావ్ రేవంత్ రెడ్డి ,మళ్ళీ జైలు కు వెళ్లాల్సి వస్తుందని భయపడ్తున్నావా ?
..తన తప్పు కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి మళ్ళీ కే టీ ఆర్ కు నోటీసు ఇచ్చి డైవెర్షన్ రాజకీయాలకు తెర తీసే అవకాశముంది
..సీఎం చేసిన ద్రోహానికి తెలంగాణ వాదుల రక్తం మరిగిపోతోంది
..ఇపుడు తెలంగాణ కు రెండో ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు
..తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి
..మీడియా రూపాలు అర్థం చేసుకోవాలి
…గోదావరి నదిని ఏపీ కి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి తన పదవి కి రాజీనామా చేయాలి
…కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర పంపులు ఆన్ చేయకుండా గోదావరి జలాలను కిందకు వదిలే కుట్రను రేవంత్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారు
..చంద్రబాబుకు వంత పాడుతూ బీజేపీ నేతలు తెలంగాణ కు ద్రోహం చేస్తున్నారు
..భాద్యతగలిగిన నాయకులు ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా వాడాలి
..జ్ఞానం లేని వాళ్ళే గోదావరి పై హక్కులు ఏపీ కి కట్టబెట్టే విధానాన్ని సమర్ధిస్తూ మాట్లాడతారు
…చంద్రబాబు సహాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను రేవంత్ చదువుతున్నారు
..రేవంత్ గురువులు మోడీ ,చంద్రబాబు .వారు చెప్పినట్టు నడుచుకుంటున్నారు
..ఏడాది లో రాహుల్ ను కలవలేదు కానీ వారిద్దరిని రేవంత్ ఎన్నో సార్లు కలుస్తున్నారు
…రాయలసీమ కు నీళ్లిచ్చే ప్రణాళిక ను కేసీఆర్ చెప్పినట్టు ఇప్పటికీ అమలు చేయవచ్చు
..రేవంత్ తీరు దొంగే దొంగ అని అరిచినట్టు ఉంది. నీళ్ల విషయం లో రేవంత్ తెలంగాణ కు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము అన్నారు..