గాల్లో ఉండగా ఇంజిన్‌ ఫెయిల్‌ అవ్వడంతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్…!

గాల్లో ఉండగా ఇంజిన్‌ ఫెయిల్‌ అవ్వడంతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఘటన..

ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలట్..

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని ప్యాన్ అని సిగ్నల్ ఇచ్చిన పైలట్.

ఇండిగో (Indigo) విమాన ఇంజిన్ గాల్లోనే ఫెయిల్ అవ్వడంతో పైలట్లు తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఘటన ముంబై ఎయిర్‌పోర్టు (Mumbai Airport)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండిగో ఫైట్ నెం.6E 6271, ఎయిర్‌బస్ A320neo న్యూఢిల్లీ (New Delhi) నుంచి మొత్తం 191 గోవా (Goa)కు బయలుదేరింది. భువనేశ్వర్ సిటీకి 100 నాటికల్ మైళ్ల దూరంలో ఫ్లైట్ ఉండగా.. రాత్రి 9.32కు ఇంజిన్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తి ఫెయిల్ అయింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు ‘పాన్ పాన్ పాన్’ అంటూ ఇంటర్‌నేషనల్ రేడియో డిస్ట్రెస్ సిగ్నల్‌తో ముంబై ఏటీసీ (ATC)కి అక్కడ ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నామని సమాచారం అందజేశారు. అనంతరం ముంబై ఎయిర్‌పోర్టు సిబ్బంది రన్‌వే‌ను క్లియర్ చేసి ఎయిర్‌పోర్టులో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. అయితే, పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు..

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959