🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 18 – 07 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
బహుళ పక్షం,
తిథి : *అష్టమి* మ3.56 వరకు,
నక్షత్రం : *అశ్విని* రా1.56 వరకు,
యోగం : *సుకర్మ* ఉ7.25 వరకు,
తదుపరి *ధృతి* తె4.24 వరకు,
కరణం : *కౌలువ* మ3.56 వరకు,
తదుపరి *తైతుల* రా2.41 వరకు,
వర్జ్యం : *రా10.11 – 11.41,*
దుర్ముహూర్తము : *ఉ8.13 – 9.04,*
తదుపరి *మ12.31 – 1.23,*
అమృతకాలం : *రా7.12 – 8.42,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : కర్కాటకం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 5.38,
సూర్యాస్తమయం: 6.34,
*_నేటి మాట_*
*భక్తికి సరియైన లక్షణం ఏమిటి??*
సాధకులైనవారు ఆదర్శవంతమైన ప్రవర్తనతో, తమ పలుకులు మధురమైన పలుకులుగా, శ్రవణము ఆనందకరమైన అతి స్వచ్ఛమైన శ్రవణముగా, హృదయమును అధ్యాత్మ భావములతో తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నము చేసినప్పుడే అది భక్తికి లక్షణమవుతుంది…
అంతేకాని సత్సంగములో చేరి విభూతి, కుంకుమబొట్టు పెట్టుకొని రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు ధరించి అనేక రకములుగా చేస్తే, ఈ దృశ్యములంతా కేవలము ప్రదర్శనములే అవుతాయిగాని నిదర్శనములు కానేరవని చెప్పవచ్చు…
ఇలాంటి చర్యలు ద్వారా భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నాలు మానుకోవాలి, మనం భక్తిని ప్రదర్శనముగా కాక, నిదర్శనముగా అనుభవించాలంటే హృదయ పూర్వకముగా మన పంచేంద్రియములను పవిత్రము గావించుకొనే ప్రయత్నానికి పూనుకోవాలి…
అదే భక్తికి సరియైన లక్షణం, దాని ప్రకారమే నడచుకోవాలి…
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏