బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్ తెలిపింది. ఈ క్రమంలో తెలంగాణలో మరోమూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది..
తెలంగాణలో రెండుమూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వర్షం కురుస్తోంది. రెండు రోజుల క్రితం కుండపోత వర్షంతో నగర ప్రజలు అతలాకుతలం అయ్యారు. అయితే, మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బుధ, గురువారాల్లో హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములు, ఈదురుగాలులతో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది..రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇవాళ (బుధవారం) ఉదయం నుంచి రేపటి (గురువారం) ఉదయం వరకు అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..