సీఎం రేవంత్ రెడ్డి తనకుందంటున్న డిగ్రీ సర్టిఫికేట్.. దొంగ డిగ్రీనేమో.. కేటీఆర్

బీసీ రిజర్వేషన్ అంశంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ లేఖ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ రాసిన లేఖలో ఏముందో సీఎం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. కనీసం లేఖ చదివే తెలివి సైతం ఆయనకు లేదంటూ సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు…సీఎం రేవంత్ రెడ్డి తనకుందంటున్న డిగ్రీ సర్టిఫికేట్.. దొంగ డిగ్రీనేమో అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ రాసిన లేఖలో ఏముందో తెలియకుండానే సీఎం రేవంత్ మురిసిపోయాడంటూ ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ ఉత్తరం రాశారని చెబుతున్నాడన్నారు. కానీ చదువు రాక సీఎం రేవంత్ రెడ్డి పరవశించి పోతున్నాడని చెప్పారు..