బంగాళ దుంపతో అనేక రకాల వంటకాలు, చిప్స్, బంగాళ దుంప బజ్జీలు, స్నాక్స్ ఇలా రక రకాల ఐటమ్స్ చేస్తుంటారు. అందుకే చాలా మంది మార్కెట్కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా వీటిని కొనుగోలు చేస్తుంటారు..అందుకే సీజన్ ఏదైనా సరే బంగాళ దుంపలకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే దీని డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన మార్కెట్లో నకిలీ బంగాళదుంపలు అమ్ముతున్నారంట.
అందుకే తప్పకుండా బంగాళదుంపల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కొందరు డబ్బు సంపాదించడానికి మార్కెట్లో నకిలీ బంగాళదుంపలు అమ్మడం ప్రారంభించారు, వీటిని గుర్తించడం చాలా కష్టం, నకిలీ బంగాళ దుంపలు తినడం వలన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
నకిలీ బంగాళ దుంపలల్లో ఉండే కృత్రిమ రంగులు, అందులో వాడే రసాయనాలు శరీరానికి చాలా హానికరం అంట. ఇవి మూత్రపిండాలు, కాలేయాన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతే కాకుండా నకిలీ బంగాళ దుంపలు అతిగా తినడం వలన కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.
కాగా, మార్కెట్లోని నకిలీ బంగాళ దుంపలను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం చూద్దాం. నిజమైన బంగాళ దుంపలను వాసనను బట్టి గుర్తించ వచ్చునంట. తాజా, నిజమైన బంగాళ దుంపలు సహజ వాసనను కలిగి ఉంటాయంట. నకిలీవి రసాయన వాసన కలిగి ఉంటాయి. అలాగే లేత ఎరుపు రంగు బంగాళదుంపలు నకిలీవని చెబుతున్నారు నిపుణులు..
ఇవే కాకుండా మీరు బంగాళ దుంపను కోసినప్పుడు దాని రంగు లోపల, వెలుపల దాదాపు ఒకేలా ఉంటే అది సహజమైనది, నకిలీ బంగాళదుంపలో బయట, వెలుపల రంగు భిన్నంగా ఉంటుందంట. అదే విధంగా, నకిలీ బంగాళదుంపపై ఉన్న బుద నీటిలో కరిగిపోయి, త్వరగా శుభ్రపడుతుందంట. కానీ నిజమైన బంగాళ దుంప పై ఉన్న బురద రుద్దిన తర్వాత కూడా అంత త్వరగా శుభ్రపడదంట. ఈ చిట్కాల ద్వారా సులభంగా నకిలీ, నిజమైన బంగాళ దుంపలను గుర్తించవచ్చునంట..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...